
అరగంటలోనే పోగొట్టుకున్న మొబైల్ను తెప్పించిన సీఐ అబ్బయ్య.
సీ కె న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,( సాయి కౌశిక్),
జూన్ 10,
రాత్రి సమయంలో తమకు సహాయం చేయాలని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన మహిళకు త్రీటౌన్ సీఐ అబ్బయ్య అండగా నిలిచారు. తాను పోగొట్టుకున్న మొబైల్ను కేవలం అరగంటలోనే తెప్పించి ఆ మహిళకు అందించారు.
ఇది విన్న పట్టణ ప్రజలు, పలువురు సీఐని అభినందనలతో ముంచెత్తుతున్నారు… ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి… కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధికి చెందిన వి. భవాని తన ఇద్దరు కుమార్తెలు, కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం రాత్రి 7.30 గంటల సమయంలో రైతుబజార్ నుంచి ప్రభుత్వ ఆస్పత్రికి ఆటోలో వె ళ్లారు.
ఆటో దిగిన తర్వాత తన మొబైల్ను ఆటోలో మర్చిపోయి ఇంటికి వెళ్లిపోయారు. తీరా ఇంటికి వెళ్లిన తర్వాత చూసుకుంటే మొబైల్ కనిపించలేదు. దీంతో కంగారుపడిన భవాని తన ఇద్దరు కుమార్తెలను తీసుకొని కొత్తగూడెం త్రీటౌను రాత్రి 9.30 గంటలకు వచ్చింది.
సీఐ అబ్బయ్యను కలిసి జరిగిన విషయాన్ని తెలియజేసింది. దీంతో స్పందించిన సీఐ అబ్బయ్య వెంటనే మొబైల్ సిగ్నల్స్ ను బ్రేస్ చేసి కేవలం అరగంటలోనే ఆ మొబైల్ను తెప్పించి సదరు మహిళకు అప్పగించారు.