ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడించిన ఆదివాసీ నాయకులు
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడించిన ఆదివాసీ నాయకులు

భద్రాచలం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడించిన ఆదివాసీ నాయకులు
సీ కె న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,( సాయి కౌశిక్),
మే 25,
తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలలో గిరిజన ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసు ముట్టడిని రాష్ట్ర ఆదివాసి సంఘాల జేసి జాక్ ఆధ్వర్యంలో భద్రాచలం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును ముట్టడించిన గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 10న అసెంబ్లీలో 11 బిసి గిరిజనేతరుల కులాలను ఎస్టీ జాబితాలాలో చేర్చుటకు తీర్మానం చేసిన కేసీఆర్ ప్రభుత్వం ఆయొక్క తీర్మానాన్ని గిరిజన ఎమ్మెల్యేలు ఇసుమంతైన వ్యతిరేకంచకుండా చచ్చిన శవముల కూర్చొని స్వాగతించినందుకు దానికి వ్యతిరేకంగా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
భవిష్యత్తులో ఆ యొక్క బిల్లును రద్దు చేయడానికి ఎమ్మెల్యేలు కృషి చేయకపోతే వచ్చేది ఎలక్షన్ సమయం కాబట్టి ఎమ్మెల్యేలు ఆలోచించు కోవాలని కోరారు…ఈ యొక్క కార్యక్రమంలో వాసం రామకృష్ణ దొర, చిచడి శ్రీరామ్ మూర్తి, కెచ్చల కల్పన, ఉష కిరణ్, కాకా సురేష్, మర్మం చిట్టిబాబు, సోడి వీర స్వామి, తదితరులు పాల్గొన్నారు.