Uncategorized

కేసీఆర్ కొడుకు నౌకరీని ఊడగొడతాం

కేసీఆర్ కొడుకు నౌకరీని ఊడగొడతాం…. నిరుద్యోగులకు నౌకర్లు ఇచ్చేదాకా పోరాడదాం

-తప్పు చేయకపోతే సిట్టింగ్ జడ్జితో విచారణ ఎందుకు చేయించడంలేదు?

-పరీక్షల రద్దుతో నష్టపోయిన నిరుద్యోగులకు రూ.లక్ష ఇవ్వాల్సిందే

-కేసీఆర్ సర్కార్ మెడలొంచేందుకే నిరుద్యోగ మహాధర్నా

-బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రకటన
-నిరుద్యోగ మహాధర్నాకు పోటెత్తిన జనం

-బండి సంజయ్ మహాధర్నాకు హాజరై సంఘీభావం ప్రకటిస్తున్న నిరుద్యోగులు, ప్రజా, యువజన సంఘాల నాయకులు

-బీజేపీ మహాధర్నాకు విచ్చేస్తున్న ఓయూ విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు

-సంజయ్ ధర్నాకు సంఘీభావం పలికిన డీఎస్సీ అభ్యర్థులు

‘‘కేసీఆర్ కొడుకు నౌకరీని ఊడగొడతాం… నిరుద్యోగులకు నౌకరీలు వచ్చేదాకా పోరాడదాం… టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేదాకా ఉద్యమిస్తాం. అందుకోసమే మా నౌకరీలు మాగ్గావాలే నినాదంతో ఈ నిరుద్యోగ మహాధర్నా చేపట్టినం’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. ఈరోజు మా నౌకరీలు మాగ్గావాలే నినాదంతో ఇందిరాపార్క్ వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ నిరుద్యోగు మహాధర్నా పేరిట దీక్షకు పూనుకున్నారు. ఈ మహాధర్నాకు పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, విజయశాంతి, జి.వివేక్ వెంకటస్వామి, ఇంద్రసేనారెడ్డి, తమిళనాడు సహ ఇంఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ మంత్రులు చంద్రశేఖర్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి తదితరులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్, ఉపాధ్యక్షులు డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు సహా వివిధ జిల్లాల అధ్యక్షులు, అధికార ప్రతినిధులు, రాష్ట్ర నాయకులు హాజరయ్యారు. బీజేపీ చేపట్టిన నిరుద్యోగ మహాధర్నాకు ఆర్టీసీ మాజీ ఛైర్మన్, కాంగ్రెస్ నేత గోనె ప్రకాశ్ రావు విచ్చేసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మహాధర్నాను ప్రారంభిస్తూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్లోని ముఖ్యాంశాలు….

• నిరుద్యోగుల భవిష్యత్ ను నాశనం చేసిన కేసీఆర్ సర్కార్ మెడలు వంచేదాకా బీజేపీ పోరు ఆగదు…

• కేసీఆర్ కొడుకును బర్తరఫ్ చేసే దాకా మెడలు పట్టి గెంటివేసేదాకా, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపేదాకా బీజేపీ ఉద్యమం ఆగదు…

• పరీక్షల రద్దుతో నష్టపోయిన నిరుద్యోగులందరికీ రూ.లక్ష చొప్పున ఇచ్చేదాకా ఉద్యమం చేస్తాం.

• నేను లేని సమయంలో సిట్ పోలీసులు మొన్న నోటీసులు అంటించి పోయారు. ఈరోజు వస్తానంటే నేనే ఆహ్వానించిన. నోటీసులు తీసుకున్నా… లీగల్ పరంగా స్పందిస్తాం. దేశం కోసం, ధర్మం కోసం కష్టపడి పనిచేసే పార్టీ బీజేపీ. తెలంగాణను కాపాడుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం.

• నువ్వు తప్పు చేయకపోతే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించడంలో అభ్యంతరమేముంది? దొంగలను పట్టుకోవాలని మేం కోరుతుంటే ప్రతిపక్షాలకు నోటీసులిచ్చే స్థాయికి ఈ ప్రభుత్వం వచ్చింది. ఇద్దరివల్లే లీకేజీ అని కేసీఆర్ కొడుకు చెప్పిండు.. మరి ఇప్పటికే 13 మందిని ఎట్లా అరెస్ట్ చేసినవ్?

• నాపై ఆరోపణలు చేసిన కేటీఆర్ కు ఎందుకు నోటీసులివ్వలేదు? నీకో న్యాయం? సామాన్య ప్రజలకు ఒక న్యాయమా?

• టీఎస్పీఎస్సీ లీకేజీకి బాధ్యత వహించి కేసీఆర్ కొడుకు మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందే… లేనిపక్షంలో బర్తరఫ్ చేయాల్సిందే.. ఇతర మంత్రులైతే లేనిపోని నిందలు మోపి బయటకు పంపుతున్న కేసీఆర్ కొడుకు లుచ్చా పనులు చేస్తున్నా ఎందుకు కాపాడుతున్నారు?

• కేసీఆర్ నయా నిజాం, కుటుంబ, అవినీతి పాలనకు వ్యతిరేకంగా బీజేపీ ఎప్పుడో యుద్దాన్ని ప్రకటించింది. ఈ ప్రభుత్వానికి బీజేపీ అంటే భయమేందో చూపిస్తాం…

• తక్షణమే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. కేసీఆర్ కొడుకును బర్తరఫ్ చేయాలి. నిరుద్యోగులకు లక్ష చొప్పున పరిహారం ఇవ్వాల్సిందే..

• నిరుద్యోగుల పక్షాన పోరాడినందు బీజేవైఎంకు చెందిన 11 మంది నాయకులను అరెస్ట్ చేసి బెయిల్ రాకుండా జైలుకు పంపారు. వందలాది మంది నాయకులపై కేసులు పెట్టారు. ఇబ్బందులు పెడుతున్నరు. మాకు జైళ్లు, కేసులు కొత్తకాదు… ధర్మం కోసం, దేశం కోసం, నిరుద్యోగుల కోసం దేనికైనా కొట్లాడతాం….

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected