
ఖమ్మం జిల్లాలో స్కూల్ బస్సు దగ్ధం
ఖమ్మం జిల్లా:జూన్ 10
ఖమ్మం నుండి కోదాడ వెళ్తున్న స్కూల్ బస్సు షార్ట్‌సర్క్యూట్ తో నేలకొండపల్లి మండల కేంద్రంలో దగ్ధమైంది. దగ్ధమైన బస్సు కోదాడ కు చెందిన తేజ టాలెంట్ స్కూల్ బస్సుగా గుర్తించారు. అయితే ఈ బస్సు ఖమ్మంలోని ముస్తఫానగర్ లో శనివారం జరిగిన ఓ పెళ్లి రిసెప్షన్ కార్యక్రమంకు హాజరై కోదాడకు వస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో ముప్పై మంది పెళ్లి బృందం సభ్యులు అందులో ఉన్నారు.
బస్సులో మంటలు రావడాన్ని గమనించిన డ్రైవర్ అప్రమత్తమై బస్సు ను పక్కకి ఆపి వెంటనే పెళ్లి బృందం సభ్యులను వేరే బస్సు ఎక్కించి పంపారు. అందరూ దిగిన కొద్ది సేపట్లోనే మంటలు పెరిగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ ఆ సమయంలో అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. గ్రామ శివారులో ఈ ప్రమాదం జరగటంతో చుట్టూ పక్కల ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వాటర్ ట్యాంక్ లతో మంటలను ఆర్పి వేశారు. సమయానికి స్థానికంగా పైర్ ఇంజన్ కూడా లేదు..