గ్రూప్–1 లో నమ్మలేని నిజాలు

గ్రూప్–1 లో నమ్మలేని నిజాలివిగో….
-బీఆర్ఎస్ జడ్పీటీసీ, సర్పంచ్, సింగిల్ విండో ఛైర్మన్ పిల్లలు, బంధువులు క్వాలిఫై
-ఒకే మండలం నుండి 50 మందికిపైగా క్వాలిఫై
-ఒక చిన్న గ్రామంలో 6గురు క్వాలిఫై
-కేసీఆర్ కొడుకే బాధ్యుడు
కేసీఆర్ నియమించిన సిట్ విచారణ ఎలా చేయగలదు?
-సిట్టింగ్ జడ్జి విచారణతోనే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం
-కేసీఆర్ కొడుకును బర్త్ రఫ్ చేయాల్సిందే
-బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ సంచలన ప్రకటన
• గ్రూప్-1 పరీక్షల్లో నమ్మలేని నిజాలు బయటకొస్తున్నాయి. బీఆర్ఎస్ నేతల పిల్లలు, బంధువులు, వారివద్ద పనిచేసే వాళ్లు గ్రూప్-1 పరీక్షల్లో క్వాలిఫై అయినట్లు మాకు సమాచారం అందుతోంది.
• జగిత్యాల జిల్లాలోని ఓ మండలంలో 50 మందికిపైగా క్వాలిఫై అయ్యారు. ఒక చిన్న గ్రామంలో 6గురు క్వాలిఫై అయ్యారు. వీరంతా బీఆర్ఎస్ నేతల కొడుకులు, బంధువులు, వాళ్ల వద్ద పనిచేసే వాళ్లే.
• నలుగురు సర్పంచుల కొడుకులు, సింగిల్ విండో ఛైర్మన్ కొడుకుతోపాటు ఒక జడ్పీటీసీ వద్ద బాడీగార్డ్ గా పనిచేసే వ్యక్తి కొడుకు క్వాలిఫై అయ్యారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కుమారుడు క్వాలిఫై అయ్యారు. ఒక సర్పంచ్ కుమారుడికి అర్హత అయ్యే అవకాశమే లేనప్పటికీ… క్వాలిఫై చేశారు.
• కేసీఆర్ కొడుకు సహకారంతోనే ఇది జరిగింది. ఆయన సన్నిహిత వ్యక్తే ఇదంతా చేశారు. ఒక్కొక్కరి దగ్గర 3 నుండి 5 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం ఉంది. తక్షణమే కేసీఆర్ కొడుకును కేబినెట్ నుండి బర్తరఫ్ చేయాలి.
• సీఎం కొడుకు ప్రమేయం ఉన్న నేపథ్యంలో ఆయన నియమించిన సిట్ తో విచారణ ఎలా సాధ్యం? సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తేనే వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయి. నయీం డైరీ, సినీ తారల డ్రగ్స్ తరహాలోనే పేపర్ లీకేజీ కేసును సైతం సిట్ కు అప్పగించి పక్కదారి పట్టించే కుట్ర జరుగుతోంది.
• లక్షలాది మంది నిరుద్యోగులను వంచించిన కేసీఆర్ ప్రభుత్వం 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. గ్రూప్-1 పరీక్షల్లో జరిగిన అక్రమాలు, కేసీఆర్ కొడుకు నిర్వాకంపై అతి త్వరలోనే వాస్తవాలు బయటపెడతాం. అసలైన దోషులను తెలంగాణ సమాజం ముందుంచుతాం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తెలిపారు