జ్యోతీరావ్ ఫూలే సేవలు మరువరానివి

“బడుగుబలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతీరావ్ ఫూలే సేవలు మరువరానివి”
సికే న్యూస్ ప్రతినిధి
బడుగుబలహీన వర్గాల ఆశాజ్యోతి- మహాత్మా జ్యోతీరావ్ ఫూలే చరిత్ర పూటల్లో అనేకులకు అదర్శం.
వివరాల్లోకి వెళ్ళితే మహాత్మా జ్యోతీరావ్ ఫూలే 197వ జయంతి సందర్బంగా చరిత్ర ఆధారంగా మహాత్మ జ్యోతిరావ్పూ ఫూలే గారి జీవితం గురించి నెమరువేసుకోవడం చాలా ఆనందంగా ఉందని నేషనల్ నింబుల్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చైర్మన్ డాక్టర్ సిహెచ్ విజయ్ మోహన్ రావు గుర్తు చేశారు. సత్యశోధకుడు చరిత్రలో ఆదర్శంగా నిలిచిన మహాత్మపూలే సేవలు మరువలేనివి. సామాజిక సమరసతను నెలకొల్పి దేశ చరిత్రలో మొట్టమొదటగా మహాత్మ అని ప్రజలచే నీరాజనాలందుకున్న మహోన్నతుడు జ్యోతిరావు ఫూలే.
జ్యోతిరావ్ పూలే.. సామాజిక సమరసతను నెలకొల్పి దేశ చరిత్రలో మొట్టమొదటగా మహాత్మ అని ప్రజలచే నీరాజనాలందుకున్న మహోన్నతుడు జ్యోతిరావు ఫూలే. జ్యోతిరావ్ ఫూలే మహారాష్ట్రలోని సతారా జిల్లాలో గోవిందరావ్, చిమానా గోవిందరావ్ దంపతులకు 1827 ఏప్రిల్ 11న జన్మించారు. పాఠశాల చదువు తక్కువైనప్పటికీ పుస్తక పఠనంపై ఆసక్తి ఎక్కువ. రాత్రుల్లో లాంతరు వెలుగులో చదువుకునేవారు.
ఆయనకు చదువుపై ఉన్న ఆసక్తిని గమనించిన ఒక ఉపాధ్యాయుడు ఆయన్ని 1841లో ఫూలేని స్కాటిష్ మిషన్ స్కూల్లో చేర్పించారు. ఇక్కడే తన జీవితకాల స్నేహితుడు అని చెప్పుకునే బిల్లాల్ గోవింద్ అనే బ్రాహ్మణునితో పరిచయం ఏర్పడింది. ఆయనతో పరిచయమే జ్యోతిరావ్ ఫూలేను భారత దేశ సామాజిక తత్వవేత్తగా అవతరించేందుకు అంకురం వేసింది. 1848 గోవింద్ వివాహానికి హాజరైన ఫూలే అక్కడ “కుల వివక్షను ఎదుర్కొన్నారు”.
ఆ క్షణం నుంచి కులవివక్షపై పోరాడాలని ఫూలే బలమైన నిర్ణయం తీసుకున్నారు ఫూలే. దానిని సాధించేందుకు జీవితకాలం పోరాడారు. “చిన్నప్పటి నుంచి మానవ హక్కులపై జ్ఞానాన్ని” సంపాదించిన ఫూలే… జార్జి వాషింగ్టన్ ,ఛత్రపతి శివాజీని అభిమానించేవారు. ఆ తర్వాత ప్రపంచంలోని “బానిసత్వం”, అంటరానితనంపైన అవగాహన పొందడం కోసం థామస్ పెయిన్ రాసిన “ది డిగ్నిటి ఆఫ్ మాన్”, జాన్ స్టూవర్ట్ మిల్ రాసిన “ఆన్ లిబర్టీ” అనే పుస్తకాలు ఆయన ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేశాయి. అని డాక్టర్ సిహెచ్ విజయ్ మోహన్ రావు ఒక ప్రకటనలో పేరుకొన్నారు.
ఈ నేపథ్యంలో నేషనల్ నింబుల్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ కో-ఆపరేటివ్ చీఫ్ డాక్టర్ సిహెచ్ ప్రవీణ్ రావు మాట్లాడుతూ, ఆనాడు దేశంలో బాల్య వివాహాలు సర్వసాధారణం. ప్రజల్ని చైతన్యపరచి, వితంతువులకు పునర్వివాహాలు జరిపించారు ఫూలే. అంతమాత్రమే కాకుండా గర్భస్రావ వ్యతిరేక కేంద్రాన్ని స్థాపించి స్త్రీల జీవితాల్లో పరిపూర్ణత తీసుకువచ్చారు.
ఇటువంటి కేంద్రం దేశంలోనే మొట్టమొదటిసారిగా స్థాపించటం విశేషం. “స్త్రీ, పురుషుల మధ్య లింగ వివక్షను ఫూలే తీవ్రంగా వ్యతిరేకించారు”. 13 వ ఏటనే వివాహం జరిగిన ఫూలే స్వయంగా తన భార్య సావిత్రీ భాయి కి విద్య నేర్పించాడు. 1848లో ఫూణెలో మొట్టమొదటిసారిగా దళిత బాల బాలికలకు పాఠశాలను నెలకొల్పారు. ఫూలే మంచి కవి, రచయిత.
1891లో ‘సార్వజనిక్ ధర్మపుస్తక్’ అనే రచన ద్వారా మతపరమైన, సాంఘికపరమైన మూఢత్వాన్ని ఘాటుగా విమర్శించారు. 1871లో సత్యశోధక్ సమాజం తరపున ‘దీనబంధు’ అనే వారపత్రికను ప్రారంభించారు. 1869లో ‘పౌరోహిత్యం బండారం’ అనే పుస్తకాన్ని రచించారు.
కులవ్యవస్థను తూలనాడుతూ వెలవరించిన ఉద్గ్రంథమే ‘గులాంగిరి’ (బానిసత్వం). ఈ పుస్తకంలో కులవ్యవస్థ అమానుష సూత్రాలను కట్టుబాట్లను ఫూలే తీవ్రంగా ఖండించారు.
బడుగు, బలహీనవర్గాల వారిని చైతన్యపరుస్తూ తన అక్షరాలను కుల వ్యవస్థను కూల్చి వేసే అస్త్రాలుగా ఫూలే వాడుకున్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి పాఠశాలలను ఏర్పాటు చేయాలని ఫూలే 1882లో ‘హంటర్ కమిషన్’కు నివేదిక సమర్పించారు అని జ్ఞాపకం చేశారు..
ఈ క్రమములో నేషనల్ నింబుల్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ డాక్టర్ జాన్ కాంతారావు మాట్లాడుతూ, 1870లో పురోహితుల దోపిడిని అరికట్టేందుకు ‘సార్వజనిక్ సభ’ స్థాపించి పలు చైతన్య కార్యక్రమాలను నిర్వహించారు.
తన సేవా కార్యక్రమాలను సమన్వయించేందుకు 1873 డిశంబర్24న ‘సత్యశోధక్ సమాజ’ సంస్థను ఏర్పాటు చేశారు. “మనమంతా దేవుని సంతానం. దేవుడి దృష్టిలో మనందరం సమానం.
ఈ భేద భావాలు మనం సృష్టించుకున్నవే. నిర్బంధ విద్య, స్వదేశీ భావన, నిరాడంబరత ని అలవర్చేందుకు సత్య శోధక సమాజం” అని ఫూలే సంస్థ లక్ష్యాలుగా పేర్కొన్నారు. 1873-74 మధ్య కాలంలో జున్నార్ పరిసర ప్రాంతాల్లోని 40 గ్రామాల్లో పెళ్ళిళ్ళు చేసి పూజారులు లేకుండా ప్రత్యామ్నాయ వివాహ సంస్కృతికి బీజం వేశారు.
శూద్రాతి శూద్రుల కార్మిక హక్కుల ఉద్యమాలకూ ఫూలే నాయకత్వం వహించారు. మరో వైపు సంస్కరణ లకి నడుం బిగించిన ఆర్య సమాజ స్థాపకులు స్వామి దయానంద సరస్వతి పూనా కు వచ్చినపుడు, ప్రచార కార్యక్రమం నిర్విఘ్నంగా జరగటంలో ఫూలే సహకారం మరువలేనిది.
గుర్తింపు లేకుండా పడి ఉన్న శివాజీ సమాధిని బైటకు తీసి సొంత ఖర్చుతో దర్శనీయ స్థలంగా చేశారు. తన విశాల భావాల ద్వారా నూత్న సమ సమాజం కోసం కృషి చేశారు. అని గుర్తు చేశారు.
నేషనల్ నింబుల్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ఎన్విరాన్మెంట్ ఆండ్ ఫారెస్ట్ రైట్స్ అఫైర్స్ చీఫ్ డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ మాట్లాడుతూ,
భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ సైతం ఫూలే జీవితం, కృషి, బోధనలతో స్ఫూర్తి పొందారు. బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన సంస్కర్త, కవి, రచయిత, వక్త, విమర్శకుడు ఫూలే 1890 నవంబర్ 28న పరమపదించారు. మహనీయులు తాను పుట్టిన కులం వల్ల కాలేరు..
తాను పొందిన జ్ఞానం వల్ల, సమాజానికి చూపిన దారిదీపం వల్ల, మహోన్నత వ్యక్తిత్వం వల్ల అని ఫూలే నిరూపించారు. సామాజిక సమానత్వం, సామాజిక సమరసత కోసం కృషి చేసిన మహానుభావులు అందరి వాళ్ళు. అందరి వాళ్ళని కొందరికే పరిమితం చేయకుండా వాళ్ళని స్మరించుకోవాల్సిన బాధ్యత అందరిది.
మహాత్మా ఫూలే ఆలోచనలను ఆచరిస్తూ, ఆయన ఆశయాలను సాధించడమే మనం ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళి అని మహాత్మ రావ్ పూలే చేసిన గొప్ప సేవలను తరతరాలకు మన భావితరాలకు అందిస్తూ ఉండాలని, మహాత్మ పూలే చేసిన సేవలు మరుపురానివని కొనియాడారు.
-డాక్టర్. పీటర్ నాయక్ లకావత్,
నేషనల్ నింబుల్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ఎన్విరాన్మెంట్ &ఫారెస్ట్ రైట్స్ అఫైర్స్ చీఫ్.