
ట్రాక్టరు ఇంజన్ అదుపు తప్పి డ్రైవర్ దుర్మరణం
సికే న్యూస్ , చర్ల మండల ప్రతినిధి.
ఏప్రిల్ 30.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం దోసిల్ల పళ్లి గ్రామ శివారు లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రోడ్డు ప్రమాద వివరాలు ఇలా ఉన్నాయి… చర్ల మండలం పెద మిడిసిలేరు గ్రామానికి చెందిన సప్కా లక్ష్మయ్య తండ్రి పేరు ముత్తయ్య వయస్సు 20 సంవత్సరాలు. మండల కేంద్రం లోని పెంకు రవాణా కిరాయికై వస్తుండగా దోశిల్ల పల్లి రహదారిపై ఉన్న మూల మలుపు వద్ద ట్రాక్టరు ఇంజన్ అదుపు తప్పి పడిపోయింది.
ట్రాక్టరు నడుపుతున్న సప్కా లక్ష్మయ్య క్రింద పడిపోయినట్లు,ట్రాక్టరు ఇంజన్ అతనిపై మీద పడడం తో అతను అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలియజేశారు. సమాచారం తెలుసుకున్న సిఐ అశోక్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.