ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిన్నారి మృతి

ప్రభుత్వ నిర్లక్ష్యంతో జవహర్ నగర్ లో చిన్నారి మృతి
టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి
CK న్యూస్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రంజిత్
*జవహర్ నగర్ ప్రధాన రహదారి విస్తరణలో తీవ్ర జాప్యం
కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, ప్రభుత్వ ఉదాసీనత తో నిత్యం ప్రమాదాలు
*ఈ మరణాలన్నీ ప్రభుత్వం చేస్తున్న హత్యలే
*కనీస స్పందన లేని స్థానిక మంత్రి మల్లారెడ్డి
*ఇటీవలే అనారోగ్యంతో గౌరీబీ భర్త మృతి, రహదారి ప్రమాదంలో ఇప్పుడు కుమార్తె మృతి
*ఇప్పటికైనా ప్రభుత్వం, స్థానిక మంత్రి స్పందించి రహదారి విస్తరణను త్వరగా పూర్తి చేయాలని స్థానికులతో కలిసి డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
జవహర్ నగర్ ప్రధాన రహదారి విస్తరణ జాప్యంతో నిత్యకృత్యం అయిన యాక్సిడెంట్స్ వల్ల ఇటీవల కార్పొరేషన్ పరిధిలోని శివాజీ నగర్ మార్వాడీ లేన్ కు చెందిన గౌరీబీ కుమార్తె 8 వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల అమ్రీన్ మృతి చెందింది.ఆ చిన్నారి కుటుంబాన్ని టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరామర్శించి,తన వంతు ఆర్ధిక సహాయం చేసి, ఆ కుటుంబానికి తాను, కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటామని , ప్రభుత్వం, స్థానిక మంత్రి స్పందించి ఇప్పటికైనా ఆ కుటుంబానికి న్యాయం చేయాలని,ఈ ప్రభుత్వం చేస్తున్న హత్యలను ఆపి కుటుంబాలు రోడ్డున పడకుండా చూడాలని, లేదంటే కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధం అవుతుందని హరి వర్ధన్ రెడ్డి హెచ్చరించారు.గౌరీబీ కుటుంబాన్ని పరామర్శించిన వారిలో హరివర్ధన్ రెడ్డి తో పాటు మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కిరణ్,అనంత లక్ష్మి,గండి సునీత,శంకర్,మాట్ల శ్రీనివాస్, నర్సింగ్, చింత విజయ,ధనమ్మ, జయమ్మ, లక్ష్మీ తదితరులు ఉన్నారు.