Uncategorized
మద్యం మత్తులో పురుగుల మందు తాగిన యువకుడు

మద్యం మత్తులో పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య ప్రయత్నం
“ములుగు జిల్లా సీకే న్యూస్ ప్రతినిధి భార్గవ్”
ములుగు జిల్లా వెంకటాపురం మండలం ముత్తారం గ్రామంలో కుటుంబ మనస్పర్దాల వలన మద్యం సేవించి మద్యం మత్తులో తన భార్యను బెదిరించే క్రమంలో ముత్తారం గ్రామానికి చెందిన కుంజ నరేష్( 34 ) అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు, విషయాన్ని వెంటనే గ్రహించిన కుటుంబ సభ్యులు వెంకటాపురం మండల ప్రభుత్వ దవాఖానాకు తరలించారు..! పురుగుల మందు తాగినటువంటి యువకుడి కుటుంబం నుంచి, తను ఏ మందు తాగాడని ఎంత మోతాదులో తాగాడని వివరణ సేకరించిన”ఎం బి బి స్ డాక్టర్” డాక్టర్ గారి ఆదేశాల మేరకు యువకుడికి సరైన సమయానికి సరైన వైద్యం అందించి ఎటువంటి ప్రాణనష్టం లేకుండా ఒక కుటుంబాన్ని నిలబెట్టిన వెంకటాపురం మండల ప్రభుత్వ దవఖాన బృందం…