మాట తప్పితే సహించేదే లేదు జూనియర్ పంచాయతీ కార్యదర్శుల డిమాండ్

మాట తప్పితే సహించేదే లేదు జూనియర్ పంచాయతీ కార్యదర్శుల డిమాండ్
“ములుగు జిల్లా సీకే ప్రతినిధి భార్గవ్”
తెలంగాణ రాష్ట్ర పరిధిలోని గ్రామపంచాయతీ అభివృద్ధి పనులలో ఎంతో కృషిచేసి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కరోనా టైంలో కూడా కుటుంబాలను వ్యక్తిగత సమస్యలను కూడా పక్కనపెట్టి గోరంటెంట్ స్థావరాలలో కరోనా బాధితులకు సేవలు అందించినటువంటి పనులలో ముఖ్యపాత్ర పోషించినదే పంచాయతీ రాజ్ ఓపికతో సహనంతో ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలను ప్రజలలో అవగాహన తెచ్చి రాష్ట్ర అభివృద్ధి జిల్లా అభివృద్ధి గ్రామాల అభివృద్ధికి కృషి చేసినటువంటి కార్యదర్శుల సేవలను గుర్తించాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఆవేదన ఇదిగో చేస్తాం అదిగో ఇస్తామంటూ కాలం వెళ్లగొడుతున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఇకనైనా కార్యదర్శులను సేవలను గుర్తించి గత కాలంలో కార్యదర్శులను విధులలోకి తీసుకునే ముందు కార్యదర్శులకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలి అంటూ తమ ఆవేదనని కార్యదర్శులు వ్యక్తం చేశారు ఎలా ఉండగా కాలము గడువు 11:04:2023 నాటికి పూర్తయినప్పటికీ రెగ్యులైజేషన్ గురించి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉత్తర్వులు వెలువడలేదందున తెలంగాణ పంచాయతీ పేరడక్షన్ (టి పి ఎస్ ఎఫ్) తేదీ: మేరకు జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నోటిఫికేషన్ నెం. 2560/సి.పి.ఆర్ & ఆర్ ఈ/బి2/2017 తేదీ: 32:08:2018 ప్రకారం 12:04:2019 రోజున విధులలో చేరారని నోటిఫికేషన్ ప్రకారం వారి యొక్క కొటేషన్ పిరియడ్ 11:04:2022 నాటికి పూర్తి కాగా కెసిఆర్ గత సంవత్సరం అసెంబ్లీ సాక్షిగా వారి నోటిఫికేషన్ పిరియడ్ ని మరొక సంవత్సరం పొడిగించారు
అని జీవో: నెం.26 ను 15:07:2021 న తీసుకురావడం జరిగింది ఇట్టి జీవో నెం.26 ప్రకారం తేదీ; 11:04:2023 ముగిసినందున రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని గ్రామస్థాయిలో అమలు చేస్తూ తెలంగాణలోని ప్రతి గ్రామము కూడా ఇతర రాష్ట్రాల కంటే ఆదర్శ గ్రామాలుగా తీర్చి దిద్దడంలో కార్యదర్శులు ముఖ్యపాత్ర పోషించారు అలాగే గ్రామాలకు పంచాయతీ కార్యదర్శుల శ్రమను కృషిని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రస్థాయిలో జాతీయ స్థాయిలో అవార్డులు కూడా ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కార్యదర్శుల రెగ్యులర్ పోస్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోకపోవడం పట్ల విసిగిపోయిన పంచాయతీరాజ్ జూనియర్ కార్యదర్శులు వారి డిమాండ్లను వ్యక్తం చేశారు.
జూనియర్ పంచాయతీ కార్యదర్శులను వెంటనే రెగ్యులర్ చేస్తూ జీవో విడుదల చేయాలి అంటూ అంతేకాకుండా గడిచిన నాలుగు సంవత్సరాల కొటేషన్ కాలాన్ని సర్వీస్ కాలంగా పరిగణలోకి తీసుకోవాలనీ మరియు ప్రస్తుతం పని చేస్తున్న అవుట్ సర్వీసింగ్ పంచాయతీ కార్యదర్శులను అందర్నీ జె.పి.ఎస్ గా ప్రమోట్ చేస్తూ పనిచేసిన కాలాన్ని కొటేషన్ క్రియల్లో భాగంగా పరిగణించాలని మరియు వారిని కూడా రెగ్యులర్ చేయాలి అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శుల క్యాడర్ స్టoత్ నిర్ధారించి ప్రకటించాలి విధులలో మరణించినటువంటి కార్యదర్శుల కుటుంబాలకు కారుణ్య నియమకాలు చేపట్టాలి
అర్హులైన సీనియర్ పంచాయతీ కార్యదర్శులకు ప్రమోషన్ ప్రమోట్ చేయాలి అంతేకాకుండా 317 జీవో వల్ల నష్టపోయిన పంచాయతీ కార్యదర్శులకు న్యాయం చేయాలి పరస్పర బదిలీల స్పోస్ బదిలీలకు అవకాశం కల్పించాలంటూ పంచాయతీ కార్యదర్శులు అందరూ ఐక్యమత్యంగా కలిసి బహిరంగ ప్రెస్ నోట్ మండల ఎంపీడీవో కార్యాలయం నందు వారి డిమాండ్లను బహిరంగపరిచారు,,,