యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప.

ములుగు జిల్లా రామప్పలో ఘనంగా ప్రపంచ వారసత్వ దినోత్సవ వేడుకలు.
కళాకారుల ఆటాపాటలతో మార్మోగిన ఆలయం
యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప.. ప్రపంచ వారసత్వ వేడుకులు ఘనంగా ప్రారంభమయ్యాయి. ‘శిల్పం, వర్ణం, కృష్ణం’ పేరుతో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా జరిగాయి.
ఈ కార్యక్రమానికి మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌లతో పాటు పలువురు ముఖ్యలు అతిథులుగా పాల్గోన్నారు.
మంత్రి సత్యవతి రాథోడ్ గారు మాట్లాడుతూ…
యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయం..
అపురూప శిల్పకళా సంపదకు చిరునామా..
ఎనిమిది వందల ఏళ్ల నాటి ఈ అద్భుతమైన కళా నైపుణ్యంతో కూడిన రామప్ప ఆలయం యునెస్కో గుర్తింపుతో చరిత్రలో నిలిచిపోయింది.
ఏలాంటి టెక్నాలజీలు లేని రోజుల్లోనే ఈ మహా కట్టడాన్ని నిర్మించారు.
గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ విశేష కృషి వల్ల రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు లభించింది.
ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకులు తెలంగాణ ప్రాంతంలోని చారిత్రక వారసత్వ సంపదపై నిర్లక్ష్యం వహిస్తే.. స్వరాష్ట్రంలో వాటికి సీఎం కేసీఆర్ ప్రాణం పోశారు.
గౌరవ సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఈ రోజు ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా రామప్ప దేవాలయం ప్రాంగణంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నాం.
రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేసింది.
ఆలయానికి వారసత్వ గుర్తింపు దక్కేలా చూడాలంటూ కేంద్రానికి గౌరవ సీఎం కేసీఆర్ సైతం గతంలో లేఖ రాశారు.
ఆలయాన్ని అనుకుని ఉన్న రామప్ప చెరువు అందాలు పర్యాటకులను కట్టిపడేస్తాయి. బోటింగ్ సదుపాయం కూడా ఉండడంతో.. పర్యాటకులకు ఈ ప్రాంతం స్వర్గ ధామమే.
రాబోయే రోజుల్లో రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాలతో ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తా