Uncategorized

రాములోరి కళ్యాణం వేళా వినూత్న నిరసన

100 మంది ప్రతినిధులు పదివేల కరపత్రాలను పంపిణీ.

గోదావరి ముంపు బాధితులు.

సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,

మార్చి 30,

నేడు శ్రీ రామ నవమి సందర్భంగా భద్రాచలం పట్టణ కేంద్రంలో ప్రగతిశీల మహిళ సంఘం మరియు గోదావరి నది ముంపు బాధితులు- నిరుపేద గృహనిర్మాణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో 100మంది ప్రతినిధులు పదివేల కరపత్రాలను పంచడం జరిగింది.ఈ సందర్భంగా పి ఓ డబ్ల్యు జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దగోని ఆదిలక్ష్మి, పొరటకమిటి అధ్యక్షుడు చిడెం ప్రశాంత్ పాల్గొని మాట్లాడుతూ, కృష్ణసాగర్ గ్రామపంచాయతీ పరిధిలోని మణుగూరు ప్రధాన రహదారి పక్కన పినపాక,భద్రాచలం నియోజకవర్గ పరిధిలో ఉన్న గోదావరి ముంపు బాధితులు మరియు ఇండ్లు లేని నిరు పేదలు సుమారు 260 రోజులుగా నిరవధిక నిరసన దీక్ష చేస్తున్నారు. బి ఆర్ ఎస్ పార్టీ భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కూడా అయిన రేగా కాంతారావు ఆదివాసీ, దళిత మహిళల గోడు వినడం లేదు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు బాధితులు వెళ్లినా అందుబాటులో లేకుండా పోయాడు. రేగా కాంతారావు ఆదివాసీ బిడ్డగా పుట్టి,ఆదివాసీ తల్లి రొమ్ము పాలు తాగి ఆదివాసుల గోడు ను పట్టించుకోకపోవడం శోచనియమని వారు అన్నారు. మణుగూరు, భద్రాచలం నియోజకవర్గ పరిధిలో ఖనిజ సంపద, ఇసుక ర్యాంపులు, జమయిల్ తోటల పేరు మీద కోట్లది రూపాయలు ఆదాయం వస్తున్నా ఈ పేదల ఇండ్ల కోసం ఖర్చు చెయ్యడం లేదు. నిరుపేదలకు 10సెంట్ల జాగ ఇవ్వడం లో ఇంత నిర్లక్ష్యమా?2022 జులై 17న, గోదావరి వరద సమయం లో ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాచలం వచ్చి సురక్షిత ప్రాంతాలలో డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ హామీ ఇంతవరకూ నెరవేరలేదు. ప్రభుత్వం యొక్క ఈ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈ కరపత్రాలను పంపిణీ చేసాము. ఈ కార్యక్రమంలో పి ఓ డబ్ల్యు నాయకులు బండ్ల కమల, కందిమల్ల లక్ష్మీ, కాడరి సుక్కమ్మ. పోరాట కమిటీ నాయకులు గొగ్గేలా ఎర్రయ్య, కుంజ మని, కురుసం సుజాత, పరిశిక రమణ, పి డి ఎస్ యు జిల్లా కోశాధికారి జె, గణేష్,జిల్లా నాయకులు దుర్గం ప్రణయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected