
రెచ్చిపోతున్న బెట్టింగ్ బంగార్రాజులు
“ములుగు జిల్లా సీకే ప్రతినిధి భార్గవ్”
ములుగు జిల్లా వెంకటాపురం వాజేడు మండలలో రెచ్చిపోతున్న బెట్టింగ్ బంగార్రాజులు ఒకపక్క దీనిపై ఇరు మండలల పోలీస్ శాఖ పలుమార్లు హెచ్చరిస్తున్నప్పటికీ ఆగని అక్రమార్కులు ఒకపక్క బంగారు భవిష్యత్తు కోసం ప్రపంచ దేశాలలో నేటి యువత పోటీ పడుతుంటే వెంకటాపురం వాజేడు మండలంలో యువత మాత్రం అక్రమ సంపాదన కోసం పక్కదారులు పడుతున్న పరిస్థితులు,
ఐ పి ఎల్ ఆన్లైన్ బెట్టింగ్ తో అప్పుల పాలై తల్లిదండ్రులకు తోటి స్నేహితులకు మొఖం చూపించలేక మానసిక సమస్యలతో పలు గ్రామాలలో ప్రాణాలు కోల్పోతున్న యువత, ఇటీవల వేసవి సెలవులు రావడంతో ప్రభుత్వ ఎలిమెంటరీ స్కూలు ఖాళీగా ఉండడంతో వాటిని అక్రమార్కులు బెట్టింగ్ అడ్డాగా మార్చుకుంటున్న పరిస్థితులు
ఒకపక్క కోడి పందాలు మరోపక్క పేకాటరాయుల వీరంగం అంతేకాకుండా టైం పాస్ కోసం ఆడే జల్దీ ఫైవ్ ఆటను సైతం అక్రమ సంపాదనకు అ ఆయా ప్రాంతాలలో అడుగులు వేస్తున్న పరిస్థితులు అక్రమ సంపాదనకు అడ్డగా మారిన ఏరియాలో నాయకులగూడెం బీసీ మర్రిగూడెం చోక్కల నేలర పేట ఈ గ్రామాలపై సంబంధిత అధికారులు నిఘా వేసి చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు కోరారు…