PoliticsUncategorized

లిక్కర్ దందాపై రేవంత్ ఎందుకు స్పందించడం లేదు?

  • బీఆర్ఎస్, మజ్లిస్ జెండాలను చూస్తేనే మహిళలు వణికిపోతున్నారు
  • అత్యాచారాలు, హత్యలు చేసే నేరస్తులను కాపాడుతున్న పింక్, పచ్చ జెండాలు
  • లిక్కర్ దందాతో మహిళల జీవితాలను నాశనం చేస్తున్న వాళ్లు మహిళా దీక్ష చేయడం సిగ్గు చేటు
  • మహిళల సమస్యలపై ఏనాడైనా స్పందించారా?
  • పార్లమెంట్ లో మహిళా బిల్లు గురించి ఎందుకు మాట్లాడలేదు?
  • నిన్నటి కేబినెట్ లో మహిళా బిల్లు, సమస్యలపై ఎందుకు చర్చించలేదు?
  • బీఆర్ఎస్ లో మహిళలకు 33 శాతం సీట్లు, పదవులు ఎందుకు ఇవ్వడం లేదు?
  • కేసీఆర్ కేబినెట్ లో 33 శాతం పదవులు మహిళలకు ఇచ్చే దమ్ముందా?
  • కేసీఆర్ బిడ్డకు మహిళా దీక్ష చేసే అర్హతే లేదు
  • లిక్కర్ దందాపై రేవంత్ ఎందుకు స్పందించడం లేదు?
  • కేసీఆర్ బిడ్డ లిక్కర్ దందాతో దేశమంతా తలదించుకుంటోంది
  • లిక్కర్ దందాను డైవర్ట్ చేసేందుకే మహిళా దీక్ష
  • మహిళా బిల్లుపై బీజేపీ చిత్తశుద్ధిని శంకించే అర్హత మీకుందా?
  • 1999 నుండి 2003 వరకు పలుమార్లు మహిళా బిల్లు పెట్టిన చరిత్ర బీజేపీదే
  • ఆనాడు బిల్లును వ్యతిరేకించిన పార్టీలతో అంటకాగుతున్న వాళ్లు మాపై ఆరోపణలు చేయడమా?
  • పార్టీ సంస్థాగత పదవుల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేస్తున్న చరిత్ర బీజేపీదే
  • ‘‘మహిళా గోస – బీజేపీ దీక్ష’’ లో బీఆర్ఎస్ నేతలపై నిప్పులు చెరిగిన బండి సంజయ్

‘‘ తెలంగాణలో బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీ జెండాలను చూస్తేనే తెలంగాణ మహిళలు భయపడే పరిస్థితి నెలకొంది. మహిళలపై హత్యలు, అత్యాచారాలు చేసే నేరస్తులను కాపాడే పార్టీలు ఆ రెండు. సినిమాల్లో విలన్లను చూస్తే ఎట్లా పారిపోతారో… ఆ రెండు జెండాలను చూస్తే ఆడవాళ్లు భయపడి ఇంట్లో తలుపులు వేసుకునే దుస్థితి ఏర్పడింది’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. తెలంగాణలో మహిళా సమస్యలపైనా, మహిళలకు జరుగుతున్న అన్యాయంపైనా, మహిళా బిల్లుపైన ఏనాడూ నోరు మెదపని కేసీఆర్ బిడ్డ ఢిల్లీలో దీక్ష చేయడం సిగ్గు చేటని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీలో, కేసీఆర్ కేబినెట్ లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా దారుణంగా అవమానిస్తున్న కేసీఆర్ బిడ్డకు ఢిల్లీలో దీక్ష చేసే నైతిక అర్హతే లేదన్నారు. పార్టీ సంస్థాగత పదవుల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనన్నారు. మహిళా బిల్లు విషయంలో బీజేపీ చిత్తుశుద్దిని శంకించడం సిగ్గు చేటన్నారు. 1999 నుండి 2003 వరకు అనేకసార్లు పార్లమెంట్ లో వాజ్ పేయి ప్రభుత్వం మహిళా బిల్లును ప్రవేశపెడితే ఆమోదించకుండా వ్యతిరేకించడమే కాకుండా బిల్లు ప్రతులను సభలోనే చించివేసిన ఎస్పీ, ఆర్జేడీ, ఎంఐఎం పార్టీలతో కలిసి బీఆర్ఎస్ అంటకాగుతూ దీక్ష చేయడం విడ్డూరమన్నారు. లిక్కర్ దందాపై ప్రజల్లో జరుగుతున్న చర్చ నుండి దారి మళ్లించేందుకే మహిళా దీక్ష పేరిట డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏ లిక్కర్ దందాతోనైనా మహిళల జీవితాలను నాశనం చేస్తున్నారో… వాళ్లే మహిళా బిల్లు పేరుత దీక్ష చేయడం వింతలో కెల్ల పెద్ద వింత అని ఎద్దేవా చేశారు.

• ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో ’’మహిళా గోస – బీజేపీ భరోసా’’ పేరిట జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సహా పలువురు మహిళా నేతలు దీక్ష చేశారు. ఈ కార్యక్రమానికి బండి సంజయ్ తోపాటు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు చింతల రామచంద్రారెడ్డి, మాజీ ఎంపీ రవీంద్రనాయక్, మహిళా మోర్చా జాతీయ కార్యవర్గసభ్యులు ఆకుల విజయ, డాక్టర్ పద్మ, మాజీ మేయర్ కార్తీకరెడ్డి, సులోచన, గీతారాణి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు…

• కేసీఆర్ బిడ్డకు ఢిల్లీలో మహిళా బిల్లుపై దీక్ష చేసే అర్హత లేనేలేదు. మహిళల గురించి మాట్లాడే నైతిక అర్హత లేనేలేదు.

• రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా సీఎం పట్టించుకోకపోవడం, మహిళలకు రాష్ట్రంలో 33 శాతం రిజర్వేషన్లు ఎందుకు కల్పించలేదో ప్రశ్నించేందుకే ‘‘మహిళా గోస –బీజేపీ భరోసా’’పేరిట దీక్ష చేయడం అభినందనీయం.

• మీకు తెలుసు… రాష్ట్రంలో మహిళలపై ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయో… వికారాబాద్, నిర్మల్, కోదాడ లో మైనర్ బాలికపైలపై జరిగిన అత్యాచారాన్ని చూశారు… నడిరోడ్డుపై జరుగుతున్న హత్యలు జరుగుతున్నా కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

• వీటిపై కనీసం నోరు మెదపని కేసీఆర్ బిడ్డ ఇయాళ ఢిల్లీలో మహిళా దీక్ష పేరుతో డ్రామా చేయడం సిగ్గు చేటు. నిజంగా చెప్పాలంటే నువ్వు ఢిల్లీలో కాదు… మీ అయ్య ఇంటి ముందు ధర్నా చేసి మహిళలకు జరుగుతున్న అన్యాయంపై ఎందుకు స్పందించడం లేదని నిలదీస్తే బాగుండేది.

• కేసీఆర్ బిడ్డకు మహిళలెవరూ అండగా లేరు. బీఆర్ఎస్ లో మహిళ అంటే కేసీఆర్ బిడ్డ మాత్రమే. తెలంగాణ జాగ్రుతి సంస్థలోనే ఇంకో మహిళ కన్పించడం లేదు. ఆమె మహిళా బిల్లు గురించి దీక్ష చేయడం చూసి జనం నవ్వుకుంటున్నారు.

• మహిళా బిల్లుపై మాట్లాడుతున్న కవిత… నిన్న జరిగిన కేబినెట్ లో మహిళా బిల్లు గురించి ఎందుకు మాట్లాడలేదు? మేం అధికారంలోకి వస్తే మహిళలకు 33 శాతం టిక్కెట్లు ఇస్తానని ఎందుకు చెప్పలేదు?

• బీఆర్ఎస్ నాయలకు పార్లమెంట్ లో మహిళా బిల్లును ప్రవేశపెట్టాలని ఎందుకు అడగలేదు? సహారా కేసులో, ఈఎస్ఐ కేసులో పైసలు దోచుకోవడం, పార్లమెంట్ కు డుమ్మా కొట్టడం తప్ప కేసీఆర్ సాధించిందేమిటి?

• అంతెందుకు కేసీఆర్ ప్రభుత్వంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను ఎందుకు అమలు చేయలేదు? పార్టీలో ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్లు ఎందుకు ఇవ్వలేదు. సంస్థాగత పదవుల్లో ఎందుకు రిజర్వేషన్లు అమలు చేయడం లేదు?

• మహిళా బిల్లుపై బీజేపీ చిత్తశుద్దిని శంకిస్తారా? ఎన్డీఏ హయాంలో వాజ్ పేయి 1998లో జూలై 13న లోక్ సభలో మహిళా బిల్లును ప్రవేశపెడితే ఆర్జేడీ ప్రభుత్వం కాపీలను చించివేసింది. 1999లో, 2002, 2003లో మహిళా బిల్లు ప్రవేశపెట్టినా ఇంతవరకు ఆమోదించలేదు. ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి.

• మోదీ కేబినెట్ లో మొత్తం 11 మంది మహిళలకు చోటు కల్పించారు. తొలి విదేశాంగ మంత్రిగా సుష్మస్వరాజ్, తొలి రక్షణ మంత్రి ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ కు అవకాశమిచ్చారు. దేశ బడ్జెట్ ను మహిళ చేతిలో పెట్టారు. రాష్ట్రపతిగా ఆదివాసీ మహిళకు అవకాశమిచ్చారు. 8 మంది గవర్నర్లు, 4 రాష్ట్రాలకు సీఎంలుగా మహిళలకు అవకాశం కల్పించాం. ఆర్మీసహా త్రివిధ దళాల్లో మహిళలకు చోటిచ్చాం.

• మహిళల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం మోదీదే. దేశంలో 11 కోట్ల కుటుంబాలకు టాయిలెట్లు, 11 కోట్ల గ్యాస్ కనెక్షన్లు, 3 కోట్ల 50 లక్షల కోట్ల ఇండ్లు, 8 కోట్ల కుటుంబాలకు నల్లా కనక్షన్లు, 25 కోట్ల మంది స్త్రీలకు జన్ ధన్ బ్యాంక్ అకౌంట్లు, 23 కోట్ల మంది మహిళలకు 8 లక్షల కోట్ల రూపాయలను ప్రధాన మంత్రి ముద్రా రుణాలివ్వడంతోపాటు ప్రధాన మంత్రి మాతృ వందన యోజన పథకం తెచ్చి 2.5 కోట్ల మందికి గర్భిణులు, బాలింతలకు 6 వేల రూపాయలు చెల్లిస్తున్నాం.

• మరి కేసీఆర్ ప్రభుత్వం మహిళల కోసం చేస్తుందేమిటి? నడిరోడ్డుపై హత్యలు జరుగుతున్నా నోరు మెదపదు? అత్యాచారాలు జరుగుతున్నా పట్టించుకోదు. అమ్మాయిల హాస్టళ్లలో కూడా సమస్యలు తీర్చడం లేదు. 700 మంది పిల్లలున్న హాస్టళ్లలో ఒకే ఒక్క టాయిలెట్ తో అల్లాడుతున్నరు. పురుగుల అన్నం పెడుతున్నారు. మంచి నీళ్లు ఇవ్వడం లేదు. నీళ్లు లేక పీరియడ్స్ వచ్చినా ఏం చేయాలో తెలియక ఏడుస్తున్నా పట్టించుకోని దౌర్భాగ్యపు ప్రభుత్వం కేసీఆర్ దే.

• ఏ మద్యం వల్ల ఇక్కడి మహిళల జీవితాలు ఛిద్రమవుతున్నాయో… తాళిబొట్లు తెగిపోతున్నాయో… అదే మద్యం వ్యాపారం చేస్తూ దోచుకుంటున్న కవిత… ఇయాళ మహిళా బిల్లు గురించి మాట్లాడటం సిగ్గు చేటు.

• కేసీఆర్ బిడ్డ చేస్తున్న లిక్కర్ దందాతో దేశమంతా తలదించుకుంటోంది. రూ.100 కోట్లతో లిక్కర్ దందా చేస్తున్న కవిత ఆ దందా సొమ్ముతో మహిళలకు వడ్డీ రుణాలెందుకు ఇప్పించడం లేదు? ఇండ్లులేక అల్లాడుతున్న మహిళలకు ఎందుకు ఇండ్లు ఇప్పించడం లేదు?

• 317 జీవోతో చెట్టుకొకరు పుట్టకొకరై అల్లాడుతున్న ఉద్యోగులు న్యాయం చేయాలని ఆందోళన చేస్తే లాఠీలతో కుళ్లబొడిచి జైళ్లో వేసినప్పుడు ఎటుపోయినవ్?

• బీజేపీ సంస్థాగత పదవుల్లో 33 శాతం మహిళలకు కేటాయిస్తున్నామనే సంగతి గుర్తుంచుకో… మరి బీఆర్ఎస్ పార్టీలో మహిళలకు చోటేది. ఆ పార్టీలో మహిళ అంటే కవిత తప్ప మరొకరు ఉన్నారా? ఆ పార్టీలో మహిళా ప్రతినిధులకు విలువ లేదు. అడుగడుగునా అవమానిస్తున్నారు. జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ కన్నీటితో జరిగిన అవమానాన్ని వివరించిన తీరు తెలంగాణ సమాజం గుర్తించింది. కేసీఆర్ తీరు తెలంగాణ సమాజానికే కళంకం తెచ్చింది.

• కేసీఆర్ బిడ్డ చేసే దందానే సక్కగ లేదు… కానీ తానో రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి అనుకుని దీక్ష చేస్తుండటం సిగ్గు చేటు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు అతీగతీ లేదు. మీరు దీక్ష చేస్తే నమ్మేదెవరు?

• సిటీలో ఉంటే మహిళలు అందంగా ఉంటారు కాబట్టే ఓట్లు వేస్తారు.. గ్రామాల్లో అందంగా ముస్తాబు కారు.. ఓట్లేయరని ఓ వెధవ చెప్పారు.. అట్లాంటోళ్లకు చెప్పుతో సమాధానం చెప్పాలి. ఇంకోడు మహిళా బిల్లును పార్లమెంట్ లో చించివేసిన పార్టీతో అంటకాగుతున్న కేసీఆర్ కు బుద్ది చెప్పాలి.

• కేసీఆర్ బిడ్డ చేసే దొంగ దందాలను ప్రజలను దారి మళ్లించేందుకే ఢిల్లీలో దీక్ష. కేసీఆర్ కొడుకుకు కళ్లు తలకెక్కినయ్. కండకావరమొక్కి మాట్లాడుతున్నరు.

• బీఆర్ఎస్ నేతలారా… మీపై సీబీఐ, ఈడీ దాడులు జరిగితే ఏనాడూ కేసీఆర్, కేటీఆర్ మాట్లాడలేదు. కానీ ఇయాళ కేసీఆర్ బిడ్డను ఈడీ విచారణకు పిలిస్తే ధర్నాలు, దీక్షలు చేస్తున్నరు. బీఆర్ఎస్ పార్ట్టీలో మీవి కుక్క బతుకులైనయ్.

• అవినీతిపరులను బీజేపీ ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఈడీ, సీబీఐలతో పార్టీకి సంబంధం లేదు. అవి దర్యాప్తు సంస్థలు. అవినీతి పరుల సంగతి తేలుస్తాయి.

• కేసీఆర్ బిడ్డ గురించి ఏనాడూ లిక్కర్ స్కాంపై నోరు విప్పడం లేదు. కేసీఆర్ బిడ్డ లిక్కర్ దందా తెలంగాణ దాటి రాష్ట్రాలు దాటి ఖండంతారాల్లో ఆమె ఖ్యాతి దాటదు.

• లిక్కర్ దందాపై పీసీసీ అధ్యక్షులు ఎందుకు మాట్లాడలేదు? బీఆర్ఎస్+బీజేపీ ఒక్కటా? బీఆర్ఎస్+కాంగ్రెస్ ఒక్కటా? ఆలోచించండి. లంగ, దొంగ దందాలతో కలిసి పనిచేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు. ప్రజాసమస్యలు పట్టని పార్టీ బీజేపీ.

• ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నా… ఎక్కడ సమస్యల్లో ఉన్నా అక్కడికి వెళ్లి పోరాడుతూ భరోసా కల్పిస్తున్న పార్టీ బీజేపీ మాత్రమే. వికారాబాద్ లో, మంథనిలో సహా ఎక్కడ హత్య జరిగినా వెళ్లి బాధితులకు భరోసా కల్పిస్తూ సమగ్ర విచారణ కోసం పోరాడుతున్న పార్టీ బీజేపీ మాత్రమే.

• బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీ జెండాలు చూస్తేనే తెలంగాణ మహిళలు భయపడే పరిస్థితి నెలకొంది. నేరస్తులను కాపాడే పార్టీలు ఆ రెండు. పింక్, పచ్చ జెండాలను చూస్తే భయానక వాతావరణం కన్పిస్తోంది. సినిమాల్లో విలన్లను చూస్తే ఆడవాళ్లు ఎట్లా పారిపోతారో… ఆ రెండు జెండాలను చూస్తే భయపడి ఇంట్లో తలుపులు వేసుకునే దుస్థితి ఏర్పడింది.

• లిక్కర్ దందాలో నీ బిడ్డకు సంబంధం ఉందా? లేదా? అనే విషయాన్ని కేసీఆర్ సమాధానం చెప్పాలి. పీసీసీ అధ్యక్షులు లిక్కర్ దందాపై నోరెందుకు మెదపడం లేదు? మీకున్న సంబంధమేందో సమాధానం చెప్పాలి. మహిళల సమస్యలపై పోరాడుతూ దీక్ష చేసేందుకు ముందుకొచ్చిన డీకే అరుణ కు హ్రుదయ పూర్వక అభినందనలు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected