TelanganaUncategorized

విద్యుత్ షాక్ కు గురై. ITBP కానిస్టేబుల్ మృతి

విద్యుత్ షాక్ కు గురై. ITBP కానిస్టేబుల్ మృతి

వాజేడు మండలంలో విషాదం ITBP కానిస్టేబుల్ మృతి

“ములుగు జిల్లా సీకే ప్రతినిధి భార్గవ్ “

ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలోని శ్రీరామ్ నగర్ గ్రామానికి చెందిన తాటి మనోజ్ s/o నారాయణ. తండ్రి నారాయణ తన కుమారుడు లో చిన్ననాటి నుంచి కుమారుడిలో దేశభక్తిని గమనించిన తండ్రి నారాయణ ఆర్థిక ఒత్తిళ్ళను సైతం తట్టుకొని తన కుమారుడి ఆసక్తి మేరకు మెరుగైన విద్య కొరకు ఉన్నత చదువులు చదివించగా తండ్రి కృషిని తన పట్టుదలగా భావించి గ్రూప్ పరీక్షల ద్వారా దేశ సరిహద్దుల్లో ITBP కానిస్టేబుల్ గా ఉద్యోగం సాధించాడు ఎన్నో సంవత్సరాల నుంచి భారతదేశ సంరక్షణ క్యాడర్లో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర సరిహద్దుల్లో ITBP కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న మనోజ్ ఇటీవల సెలవుల ద్వారా ములుగు జిల్లా వాజేడు మండలం శ్రీరామ్ నగర్ తన ఇంటికి వచ్చాడు వచ్చిన కొద్దిరోజుల తర్వాత మధ్యాహ్నం సమయంలో తన స్వగృహం నందు కూలర్ ల్లో నీళ్లు పోస్తుండగా విద్యుత్ షాక్ కి గురయ్యాడు కరెంటు షాక్ కి గురైన మనోజ్ ని గమనించిన కుటుంబ సభ్యులు దగ్గరలోని ఏటూరునాగారం హాస్పిటల్ కి తరలించారు కరెంట్ షాక్ కు గురైన మనోజ్ మృతి చెందినట్లుగా ఏటూరునాగారం వైద్య సిబ్బంది ధ్రువీకరించారు చేతికి అందిన కుమారుడు చేతుల్లోనే దూరమయ్యాడని కుటుంబ సభ్యులు తీరని విషాద శ్లోకానికి గురయ్యారు…

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected