Uncategorized
విద్య వైద్యాన్ని జాతీయం చేయాలి ఆర్ నారాయణ మూర్తి
విద్య వైద్యాన్ని జాతీయం చేయాలి ఆర్ నారాయణ మూర్తి

విద్య.. వైద్యాన్ని జాతీయం చేయాలి *ఆర్ నారాయణ మూర్తి
కోకిల డిజిటల్ మీడియా
హైదరాబాద్ :ప్రతినిధి
హైదరాబాద్ :మే10
‘‘పేపర్ లీకేజ్ వ్యవహారాలు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో కూడా జరిగాయి. ఇలాగైతే నిరుద్యోగులు ఏమైపోవాలి? అందుకే విద్య, వైద్యాన్ని జాతీయం చేయాలని చెప్పే చిత్రమే ‘యూనివర్సిటీ’’ అన్నారు ఆర్. నారాయణ మూర్తి. స్నేహచిత్ర పిక్చర్స్‌పై ఆర్. నారాయణ మూర్తి నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘యూనివర్సిటీ’. ఈ నెల 26న ఈ చిత్రం రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆర్. నారాయణ మూర్తి మాట్లాడుతూ– ‘‘భారత దేశంలో చాలా చోట్ల పేపర్ లీకేజీలు జరుగుతున్నాయి.. దీన్ని జాతీయ సమస్యగా పరిగణించాలని ఆర్.నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు..