
సరిహద్దుల్లో ఎదురుకాల్పులు
సీ కె న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,
మే 07,
తెలంగాణ-ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఒక యాక్షన్ టీం పోలీసు వారిపై దాడి చేయాలనే లక్ష్యంతో సంచరిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు.
పోలీసులపై ఈ రోజు ఉదయం పుట్టపాడు(కిష్టారం పిఎస్) అటవీ ప్రాంతంలో సుమారుగా 6.10 గంటలకు అకస్మాత్తుగా ఒక ఎత్తైన ప్రదేశం నుండి మావోయిస్టులు కాల్పులు జరిపారు.వెంటనే అప్రమత్తమైన పోలీసులు తిరిగి ఎదురు కాల్పులు జరిపారు.
కొన్ని నిమిషాల పాటు మావోయిస్టులకు,పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.అనంతరం ఎదురుకాల్పులు జరిగిన ప్రదేశంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి రెండు మృతదేహాలు,ఒక ఎస్ ఎల్ ఆర్ ఆయుధం,ఒక సింగల్ బోర్ తుపాకీ మరియు ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
రెండు మృతదేహాల్లో ఒకరు చర్ల ఎల్ ఓ ఎస్ కమాండర్ మడకం ఎర్రయ్య @ రాజేష్ గా గుర్తించడం జరిగింది.మరొక మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.ప్రస్తుతం ఇంకా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది.