సీకే న్యూస్ వరుస కథనానికి స్పందించిన జిల్లా విద్యాశాఖ అధికారి

సీకే న్యూస్ ను స్పందించిన జిల్లా విద్యాశాఖ అధికారి
ఉపాధ్యాయుడు శెట్టిపల్లి రామారావును సస్పెండ్ చేస్తూ ఉత్తరాలు జారి
సి కె న్యూస్ ప్రతినిధి జూలూరుపాడు ……………భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామపంచాయతీ పరిధిలోగల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు శెట్టిపల్లి రామారావు అనే వ్యక్తి చదువు చెప్పవలసిన మైనర్ బాలికలుపై లైంగిక మరియు అసభ్యకరమైన పదజాలాలతో ఆరు నెలల నుండి వేధిస్తూ ఉన్నాడు. ఈ విషయంపై బాలికలు నిన్న రాత్రి తల్లిదండ్రులకు చెప్పడం ద్వారా విషయాన్ని తెలుసుకున్నారు. ఈ విషయంపై సీకే న్యూస్ వారు కథనం ప్రచురించగా వెలుగులోకి వచ్చిన విషయాన్ని స్పందించిన ఎంఈఓ డీఈవో కు రాతపూర్వకంగా సమాచారం పంపినప్పటికీ స్పందించిన డీఈఓ ఉపాధ్యాయుడు శెట్టిపల్లి రామారావు ని సస్పెండ్ చేస్తు ఉత్తర్వులు జారీ చేయడం జరిగినది నిన్న రాత్రి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. జూలూరుపాడు పోలీస్ స్టేషన్లో సంబంధిత మాస్టర్ పై పలు సెక్షన్లో కేసు నమోదు అయినది ప్రజా సంఘాలు మరియు అఖిలపక్ష పార్టీలన్నీ కుల సంఘాలు కలిసి స్కూలు ముందు ధర్నా చేయడం జరిగింది. సంబంధింత ఉపాధ్యాయుని వెంటనే అరెస్టు చేయాలని తక్షణమే అరెస్టు చేయాలని మరియు రిమాండ్ కి తరలించాలని డిమాండ్ చేశారుఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు గిరిజన సంఘ సేవలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షుడు నవీన్ రాథోడ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాలోత్ మంగీలాల్ నాయక్ . సిపిఎం ml ప్రజాపంద మండల సంయుక్త కార్యదర్శి బానోత్ ధర్మ నాయక్ .దిశ ఫౌండేషన్ రాష్ట్ర కార్యదర్శి కోడెం సీతా కుమారి. ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి ఎస్.కె చాంద్ పాషా , ఏ ఐ వై ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.కె నాగుల్ మీరా, జిల్లా నాయకులు బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు శ్రీనాధ రాజు నాగరాజు , ఎల్ హెచ్ పి ఎస్ జిల్లా అధ్యక్షుడు కేశవ్ నాయక్ . ఎల్ హెచ్ పి ఎస్ వైరా నియోజకవర్గ నాయకులు లకావత్ నాగేశ్వరావు నాయక్. ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు పవన్ కుమార్ …