యువకుడి ఇంట్లో యువతి మకాం

పెండ్లి పేరుతో యువకుడు మోసం.

బోథ్ : మండలంలోని నారాయణపూర్ గ్రామానికి చెందిన ఓ యువతిని అదే గ్రామానికి చెందిన నవీన్ జాదవ్ అనే యువకుడు పెండ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు.

ఈ సంఘటన మండలంలో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే నారాయణపూర్ గ్రామానికి చెందిన పై యువతీ యువకుడు గత సంవత్సర కాలంగా ప్రేమించుకుంటున్నారు.

ఈ విషయం బయటకు తెలియడంతో ఊరి పెద్దల సమక్షంలో ఇరువురి కుటుంబ సభ్యులు పంచాయితీ నిర్వహించగా యువకుడు పెండ్లికి ఒప్పుకున్నట్లే ఒప్పుకొని తరువాత నిరాకరించాడు. ఊరి పెద్దలు చెప్పినా వినకపోవడంతో గత ఏడాది డిసెంబర్ 29న బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో స్థానిక ఎస్సై ఇరువురి కుటుంబ సభ్యులను పిలిచి కౌన్సెలింగ్ నిర్వహించారు.

యువకుడి ఇంట్లో యువతి మకాం

యువకుడు ఒప్పుకోకపోవడంతో యువతి గత నెల రోజుల నుండి యువకుడి ఇంట్లో మకాం వేసింది. యువతి ఇంట్లోకి రావడంతో యువకుడు, కుటుంబ సభ్యులు తాము ఉంటున్న ఇంటిని విడిచి వెళ్లిపోయారు. యువతికి రాత్రి సమయంలో ముసుగు ధరించిన గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, అంతే కాకుండా పురుగుల మందు డబ్బాను ఇంట్లో విసిరేసి చావమంటూ బెదిరించారని బాధితురాలు పేర్కొంది. తాను ప్రేమించిన యువకుడు పెండ్లి చేసుకునే వరకు ఆయన ఇంట్లోనే ఉంటానని, లేదా ఇక్కడే చస్తానని పేర్కొంది.

Ck News Tv

Ck News Tv

Next Story