✕
తల్లి మరణం తట్టుకోలేక తనయుడి మృతి
తల్లి మరణం తట్టుకోలేక తనయుడి మృతి
తనయుడికి తల్లి అంటే ఎంతో ప్రేమ... తల్లి మరణించిన సంఘటన చూసి ఆ తనయుడి గుండె ఆగిన హృదయ విధారక సంఘటన ఇది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామానికి చెందిన నిరుపేద వృద్ధురాలు గుడిసె భారతమ్మ (73) గురువారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందింది
మృతురాలి అంత్యక్రియలు పూర్తిచేసి ఇంటికి చేరుకున్న తనయుడు గుడిసె శ్రీనివాస్ (46) బాధను తట్టుకోలేక కంటతడి పెడుతూ గోరున విలపించి ఒక్కసారిగా కుప్పకూలి స్పృహ తప్పి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికంగా తాపీ పని చేస్తూ జీవనం కొనసాగించే శ్రీనివాస్ మృతి గ్రామంలో ధావనంలో వ్యాపించింది ఆ తల్లి తనయుల ప్రేమాభిమానాలు చెప్పుకుంటూ స్థానికులు విలపిస్తున్న తీరు చూపరులను సైతం కంటతడి పెట్టించింది.

Ck News Tv
Next Story