మాజీ సర్పంచ్‌పై హత్యాయత్నం

మాజీ సర్పంచ్‌పై హత్యాయత్నం

మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలం సేరిపురం బీఆర్‌ఎస్‌ మాజీ సర్పంచ్‌ ధరావత్‌ సక్రుపై శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు హత్యాయత్నానికి పాల్పడ్డారు.

కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. సేరిపురం మాజీ సర్పంచ్‌ సక్రు గార్ల మండల కేంద్రానికి పురుగుమందు కోసం వచ్చాడు.

తిరిగి వెళ్తున్నక్రమంలో మార్గమధ్యంలో పుణ్యతండా వద్ద గుర్తు తెలియని ఆరుగురు వ్యక్తులు కర్రలతో దాడి చేయగా తప్పించుకొని మామిడి తోటలోకి పరుగు తీశాడు. అక్కడ మిర్చి ఏరుతున్న వారు రావడంతో దుండగులు పారిపోయారు. ఈ మేరకు సక్రు తల్లి మణెమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Ck News Tv

Ck News Tv

Next Story