నేను ఏ తప్పు చేయలేదు అన్యాయంగా నా మీద నిందలు వేస్తున్నారు
నేను ఏ తప్పు చేయలేదు అన్యాయంగా నా మీద నిందలు వేస్తున్నారు

నేను ఏ తప్పు చేయలేదు అన్యాయంగా నా మీద నిందలు వేస్తున్నారు. మానసికంగా కూనీ చేస్తున్నారు. ధర్మసాగర్ మహిళా సంఘాలు. పుట్ట పద్మ వివో
సి కె న్యూస్ ఫిబ్రవరి 19 హనుమకొండ జిల్లా ,ధర్మసాగర్ మండలం, ప్రతినిధి కమలాకర్.
స్థానిక ధర్మసాగర్ గ్రామం లో పుట్ట పద్మ పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తూ మహిళా సంఘాలలో ఎటువంటి అవకతవకలు చేయలేదని తెలియపరుస్తూ తన బాధను అంత వ్యక్తపరిచినారు. పుట్ట పద్మ సిరి గ్రామక్య సంఘం లో 2007 నుండి 12 సంఘాలతో వివో ప్రారంభించుకొని విధులు నిర్వహిస్తున్నాను. 12 సంఘాల నుండి 30 సంఘాల వరకు ఏర్పాటు చేసుకున్నాను. 2018 సంవత్సరంలో మా సంఘాలకు శ్రీనిధి నుండి లోన్స్ మంజూరు అయినవి.
2018 - 2019 వరకు సంఘాలు రెగ్యులర్ గా ఉన్నాయి. కరోనా సమయంలో 2019- 2020, 2021 సమయంలో డిఫాల్ట్ అయినాయి, ఆగస్టు నెల 2021 సంవత్సరంలో మా వివో లోని సంఘాలకు ప్రభుత్వం నుండి పావలా వడ్డీ రుణాలు 12,74,388 రూపాయలు మంజూరు అయినవి. ఇట్టి డబ్బులు అప్పుడు ఉన్న శ్రీనిధి మేనేజర్ వెంకటేష్ , సీసీ కవిత 9,20,000 రూపాయలు వివోఖాతా నుండి శ్రీనిధి ఖాతాకు ఎన్ పి ఏ సంఘాలకు అడ్జస్ట్మెంట్ చేయించడ మైనది. దాని తాలూకు ఎవిడెన్స్ పత్రికా విలేకరులైన మీ ముందు ఉంచినాను.
2021 అక్టోబర్ నెలలో సిరి గ్రామక్య సంఘాలలోని సంఘాలకు శ్రీనిధి లోన్స్ మంజూరు అయినవి. సంఘాలకు లోన్స్ చేయిస్తూ సంఘ సభ్యుల ఖాతాలో పడిన అమౌంట్ను శ్రీనిధి మేనేజర్ వెంకటేష్ సార్ ఎన్ పి ఏ లెక్క ప్రకారం లెక్కలు చేసి సంఘాలకు ఇవ్వడం జరిగింది. అట్టి డబ్బులు సంఘాలపై వసూలు చేసుకుంటూ విఎల్ఆర్ లు సంఘాలకు ఇవ్వడం 16 సంఘాలకు 9,73,167 రూపాయలు ఇవ్వడం అయినది ఐదు సంఘాలకు ఒక 1, 33,251 రూపాయి అడ్జస్ట్మెంట్ చేయించడం జరిగింది. 1,67,970 రూపాయలు మాత్రము ఐదు సంఘాలకు ఇవ్వాలి. ఇట్టి డబ్బులు 2019 నుండి బకాయిపడిన సంఘాలపై ఉన్నవి. ఇది నిజము ఇట్టి విషయమును మహిళా సంఘాలు రాద్ధాంతం చేస్తూ నన్ను సంఘంలో, సమాజంలో ఇబ్బంది పెట్టాలని, కలెక్టర్ వద్దకు వెళ్లి ,లేనిపోని అబద్ధాలు చెప్పి మానసికంగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు. మహిళా సంఘాలు ఏర్పరచినటువంటి కమిటీలు నిజ నిర్ధారణ చేసినప్పుడు దానికి కట్టుబడి ఉంటానని, నాపై ఎటువంటి నిజనిర్ధారణ జరగక ముందే నన్ను దోషిగా చూపెట్టడం సరికాదు నా వద్దనే తప్పు జరిగిందని తెలిస్తే నేను బాధ్యత వహించి మహిళా సంఘాలకు న్యాయం చేస్తాను.
ఇట్టి విషయము తేలకముందు మహిళా సంఘాలు తొందరపాటుతో నన్ను బదునాం చేస్తున్నారు . నాపై అధికారులు నామీద ఎట్టి చర్యలు తీసుకున్న వారికి నేను సహకరిస్తానని, నా జీవితంతో మహిళా సంఘాలు ఆడుకోవద్దని, దయచేసి తెలియపరుస్తున్నాను. నన్ను ఇందులో ఇరికించాలని , నేనంటే పడని , నాపాలివారు పుట్ట ప్రశాంత్ పుట్ట రజనీకాంత్ గంగారపు శ్రీనివాస్, వీరి మాయలో మహిళా సంఘాలు పడి ఇలా నన్ను ఇబ్బంది పెడుతున్నారు.
దయచేసి మహిళా సంఘాలు వారి మాయలో పడవద్దు అని ఆలోచించాలని అన్నారు.
