*సాగు నీటి కోసం రమణన్న పోరుబాట..!*

*సాగు నీటి కోసం రమణన్న పోరుబాట..!*
ఇక్కడి వారు రైతులు కారా..
అక్కడి వారే రైతుల...!
చలివాగు ప్రాజెక్టులో కనీసం 15 అడుగుల నీటిమట్టం ఉండేలా చూడాలి.
ఇక్కడి రైతులను కాదని ధర్మసాగర్ కు నీటిని పంపు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు.
ఈ సమర్థ ప్రభుత్వం వల్ల నెలరోజులు పాటు చలివాగులోకి నీటిని పంపింగ్ చేయకపోవడం వల్లే ఈ సమస్య.
రైతుల సమస్యపై రాజకీయం చేయడం మాకు అవసరం లేదు...!
కానీ రైతుకి అన్యాయం జరిగితే మాత్రం ఉద్యమం చేయడానికి సిద్ధం...!
చలివాగు పంపు హౌస్ వద్ద ధర్నా నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర.
తేది:11/03/2025,
జోగంపల్లి గ్రామం,
శాయంపేట మండలం,
కచంలో కూడున్న తినలేని పరిస్థితి అన్నట్లు, ధర్మసాగర్ వరకు నీటిని పంపు చేసే చలివాగు ప్రాజెక్ట్ చేరువలో ఉన్న ఇక్కడి రైతులకు సాగు నీరు లేక ఎండిపోతున్న పంట పొలాలను చూసి రైతన్న దిగ్భ్రాంతి చెంది రైతు ఆత్మహత్యలకు పాల్పడుతున్న కనీసం కనికరం చూపించని ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై ఈ రోజు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతులు,బిఆర్ ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులతో కలిసి శాయంపేట మండలం,జోగంపల్లి గ్రామంలోని చలివాగు ప్రాజెక్ట్ వద్ద ధర్నా చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి గారు పంపు హౌస్ CE అశోక్ కుమార్ గారికి ప్రాజెక్ట్ వద్ద నుండి ఫోన్ చేసి చలివాగు ప్రాజెక్ట్ లో కనీసం 15 అడుగుల నీటిమట్టం ఉండేలా చర్యలు చేపట్టి ఇటు చలివాగు ఆయకట్టు వెంట పండే పంట పొలాలకు సాగు నీరు విడుదల చేసిన తరువాతే పైకి ధర్మసాగర్ కి నీటిని పంపిణీ చేయాలని, అలా కాదని ఇక్కడి రైతులు రైతులు కాదన్నట్టు,వారే రైతులు అన్నట్టు ఇక్కడి పంట పొలాలను ఎండబెట్టి పైకి నీటిని తీసుకెళ్ళాలని చూస్తే,చూస్తూ ఊరుకునేది లేదని పంపు మోటార్లు బంధు పెడతామని హెచ్చరించారు.
ప్రస్తుతం పది అడుగుల నీటిమట్టం మాత్రమే నీటి మట్టం ఉంది అన్నారు.
నెల రోజుల పాటు చలివాగు ప్రాజెక్ట్ లోకి నీటిని విడుదల బంధు పెట్టడం వల్లే ఈ సమస్య ఏర్పడింది.
మా డిమాండ్ ఒక్కటే ఇక్కడి రైతులకు సాగు, తాగు నీటిని విడుదల చేసిన తరువాత కనీసం 15 అడుగుల నీటిమట్టం ఉండేలా చర్యలు తీసుకొని తరువాత పైకి నీటిని పంపు చేయాలి.
నీటి మట్టం పెరిగే వరకు మోటార్లు బంధు పెట్టాలని డిమాండ్ చేశారు.
*అనంతరం మీడియా మిత్రులతో మాట్లాడుతూ....*
అన్నపూర్ణ రాష్ట్రంగా ఉన్న నా తెలంగాణ రాష్ట్రాన్ని అనాలోచిత పరిపాలన అసమర్థత వల్ల, చేతకానితనం వల్ల ఈ రోజు రైతులు ఎంతో ఆందోళనతో తీవ్రమైన నిరాశ నిస్పహల మధ్య రైతులు ఉన్నారు.
అందుకే ఈ రోజు రైతుల పక్షాన,ప్రజల పక్షాన చలివాగు ప్రాజెక్టు వద్ద ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
అనాలోచిత పరిపాలన అని ఎందుకు అన్నమంటే జనవరి నెలలో దాదాపు నెల రోజుల పాటు చలివాగు ప్రాజెక్ట్ లోకి నీటి పంపిణీ జరగలేదు ఎందుకు జరగలేదు అంటే కాంట్రాక్టర్కి ఇవ్వాల్సిన 4 నుండి 5 కోట్ల రూపాయల బిల్లు ఇవ్వకపోవడం, స్పందించకపోవడంతో అక్కడి వర్కర్స్ జీతాలు ఇవ్వకపోవడం వల్ల పంపింగ్ బంధు చేయడంతో ఈ సమస్య ఏర్పడింది.
రైతులకు సంబంధించిన విషయంలో పూర్తి నిర్లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది.
ఇక్కడుండేటట్టువంటి స్థానిక ఎమ్మెల్యే అసమర్థత చాలా స్పష్టంగా కనిపిస్తుంది.
నేను ఎంఎల్ఏ గా అధికార పక్షంలో ఉన్నప్పుడు,నాకు ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఫోన్ వచ్చినప్పటికీ నేను ఎమ్మెల్యేగా ఒక్కటే చెప్పిన నా రైతుల పంట పొలాలు బంధు పెట్టి పైకి నీటిని పంపు చేయలేనని ఖరాఖండిగా చెప్పి ఆ రోజు చలివాగు పంపు మోటార్లు బంధు పెట్టి చలివాగు ఆయకట్టు పొలాలకు నీటిని విడుదల చేయడం జరిగిందని తెలిపారు.
కాబట్టి ఈ రోజు ప్రభుత్వాన్ని ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం, పైనుండే పొలాలకు నీళ్లు పోతాయి ఇక్కడి పంట పొలాలు ఎండగొడితే మాత్రం ఎకరాకు రూ.50000/- ల నష్ట పరిహారం ఈ ప్రభుత్వం బేషరతుగా ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఎండగడతామని డిమాండ్ చేస్తున్నాం.
దీక్ష చేస్తూ ఇరిగేషన్ అధికారులతో మాట్లాడిన తరువాత ఈ సందర్భంలో ఇక్కడికి ఇరిగేషన్ EE గారు ఇక్కడికి వచ్చి 6 రోజుల లోపుల 15 అడుగుల నీటిమట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చారు.
ఒకవేళ కనుక 15 అడుగుల నీటిమట్టం రాకుండా ఇక్కడి పంట పొలాలు ఎండగోడితే మాత్రం రైతుల పక్షాన ఉద్యమం చేస్తాం.
అవసరం అయితే మేమే తాళాలు పగలగొట్టి,మోటార్లు బంధు పెడతామని హెచ్చరించారు.
నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వారం రోజులకు ఒక్కసారి చలివాగు నీటిమట్టం పై అధికారులతో మాట్లాడి నీటి మట్టం తగ్గితే మోటార్లు బంధు పెట్టించి నీటి మట్టం పెరిగిన తరువాత పంపింగ్ చేయమని అధికారులకు చెప్పేది వాళ్ళు కూడా అదే విధంగా సహకరించేవారు.
కానీ ఈ రోజు ఇక్కడ పర్యవేక్షణ లోపమా,నాయకత్వ లోపమా, చేతకాని తనమో తెలియదు కానీ ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది.
మాకే ఉద్దేశ్యం లేదు,రైతుల సమస్యలపై రాజకీయం చేసే అవసరం లేదు.
రైతుల పంట పొలాలు ఎండిపోకుండా చలివాగు ఆయకట్టు వెంట చిట్యాల,రేగొండ, మొగుళ్ళపల్లి,టేకుమట్ల వరకు వారి పంట పొట్ట దశలో ఉంది, అందరూ కూడా రైతులే,ఇక్కడి పరిస్థితి అర్థం చేసుకొని చలివాగు తూము ద్వారా నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలనీ డిమాండ్ చేస్తున్నాం.
DBM 38 ద్వారా రావలసిన నీటి యొక్క వాట మాకు రావడం లేదు,పైనున్న వారే ఎక్కువ వాడుకోవడం వల్ల మాకు అన్యాయం జరుగుతుంది. డిబిఎం 38 ద్వారా గొరికొత్తపల్లి వరకే నీళ్ళ వస్తున్నాయి.
నేను ఎమ్మెల్యేగా ఉన్నపుడు ఒక్క పర్యవేక్షణ పెట్టి పోలీసు అధికారులు,మా ప్రజాప్రతినిధుల సహాయంతో చిట్యాల,టేకుమట్ల వరకు నీటిని తీసుకెళ్ళి చిన్న చిన్న చెరువులని నింపి మత్తడి స్థాయి వరకు తీసుకెళ్ళం అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో శాయంపేట, గోరికొత్తపల్లి,రేగొండ,చిట్యాల, మొగుళ్ళపల్లి బి ఆర్ ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
