వ్యవసాయ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్య...

వ్యవసాయ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్య... ర్యాగింగా... వ్యక్తిగత కారణాలా...?
పండుగ పూట విషాదం..
వరంగల్ ములుగు రోడ్డులోని ఆరేపల్లి క్రాస్ రోడ్డు వద్ద గల వ్యవసాయ పరిశోధన కేంద్రం ఆవరణలోని వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ అగ్రికల్చర్ మొదటి సంవత్సరం చదువుతున్న రేష్మిత (20) అనే విద్యార్థిని ఆత్మహత్యచేసుకున్న ఘటన కలకలం రేపింది.
నల్గొండ జిల్లాకు చెందిన రేష్మిత బుధవారం కళాశాలలోని ఓ గదిలో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి అనుబంధంగా ఇక్కడ నడుస్తున్న వ్యవసాయ కళాశాలలో కొంతకాలంగా ర్యాంగింగ్ జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సీనియర్లు ర్యాంగింగ్ కు పాల్పడుతున్నారని గతంలోనే మృతురాలు తన తల్లిదండ్రులకు చెప్పగా వారు నచ్చజెప్పి తిరిగి కాలేజీకి పంపినట్లు సమాచారం. ఈ క్రమంలోనే నేడు బలవన్మరణానికి పాల్పడటం గమనార్హం. మరోపక్క ఆత్మహత్యకు వ్యక్తిగత కారణాలు కూడా కారణమని తెలుస్తుంది.
ఏనుమాముల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
