కన్నపిల్లలు తాగే కూల్ డ్రింక్ లో కలుపు మందు కలిపిన కసాయి తల్లి
కన్నపిల్లలు తాగే కూల్ డ్రింక్ లో కలుపు మందు కలిపిన కసాయి తల్లి
![కన్నపిల్లలు తాగే కూల్ డ్రింక్ లో కలుపు మందు కలిపిన కసాయి తల్లి కన్నపిల్లలు తాగే కూల్ డ్రింక్ లో కలుపు మందు కలిపిన కసాయి తల్లి](https://cknewstv.in/h-upload/2025/02/11/1974465-img-20250211-wa0025.webp)
కన్నపిల్లలు తాగే కూల్ డ్రింక్ కలుపు మందు కలిపిన కసాయి తల్లి
పిల్లలిద్దరినీ హతమార్చేందుకు ప్రయత్నించిన తల్లి
ఆపై విషయం బయటపడటంతో ఆత్మహత్యాయత్నం
ఆ తల్లి కన్న ప్రేమను మరిచి తన పిల్లలిద్దరినీ హతమార్చేందుకు ప్రయత్నించింది.
కూల్‌డ్రింక్‌లో గడ్డిమందు కలిపి తాగించి.. విషయం తెలియడంతో భయపడి ఎలుకలమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం జోగ్యతండాలో ఈ నెల మొదట్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జోగ్యతండాకు చెందిన వాంకుడోతు ఉష భర్త గతేడాది అనారోగ్యంతో మృతి చెందాడు.
అప్పటి నుంచి ఉష తన పిల్లలు వరుణ్‌తేజ్, నిత్యశ్రీతో కలిసి జోగ్యతండాలోనే ఉంటూ కూలి పనులకు వెళుతూ జీవనం సాగిస్తోంది. ఈ నెల 5వ తేదీన పిల్లలిద్దరూ అస్వస్థతకు గురై వాంతులు చేసుకుంటుండగా ఉష వారిని ఖమ్మంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లింది. వారిద్దరూ కూల్‌డ్రింక్ తాగిన తర్వాత అస్వస్థతకు గురైనట్లు వైద్యులకు తెలిపింది. చిన్నారుల ఆరోగ్యం క్షీణించడంతో మెరుగైన వైద్యం నిమిత్తం వైద్యుల సూచనతో..
ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వారికి వైద్య పరీక్షలు నిర్వహించి గడ్డిమందు తాగినట్టు అనుమానం ఉందని చెప్పడంతో.. బంధువులు ఉషను నిలదీశారు. పిల్లలకు తానే కూల్‌డ్రింక్‌లో గడ్డిమందు కలిపి తాగించానని చెప్పడంతో వారంతా అవాక్కయ్యారు.
వెంటనే చిన్నారులను హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఉష నిలోఫర్ ఆస్పత్రి వద్ద ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. ఆమెను కుటుంబసభ్యులు గాంధీ ఆసుపత్రిలో చేర్చారు. కాగా చిన్నారుల్లో బాబు కోలుకొంటుండగా పాప పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు.
![Ck News Tv Ck News Tv](/images/authorplaceholder.jpg?type=1&v=2)