ఏసీబీ అంటూ ఫోన్ చేసి.. తహసీల్దార్కే రూ. 3 లక్షలు టోకరా

ఏసీబీ అంటూ ఫోన్ చేసి.. తహసీల్దార్కే రూ. 3 లక్షలు టోకరా
సైబర్ క్రైం నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఎవర్నీ వదలడం లేదు. రాజకీయ నాయకులు, పోలీసులు, ప్రభుత్వ అధికారులు, సామాన్యులు,చిన్నాచితక ఉద్యోగుల్ని సైతం వదలకుండా దోచేస్తున్నారు.
డిజిటల్ అరెస్ట్ లు,ఫోన్లకు లింక్ లు పంపి.. ఏసీబీ, సీబీఐ అంటూ దోచేస్తున్నారు. లేటెస్ట్ గా తహసీల్దార్ నే బురిడీ కొట్టించిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. ఏసీబీ అధికారులమంటూ 3లక్షలు దోచేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజాపేట తహశీల్దార్ దామోదర్ కు ఏసీబీ అధికారిని అంటూ ఓ ఫోన్ వచ్చింది. మీరు ఆన్ లైన్ మోసాలకు , అవినీతికి పాల్పడుతున్నారని డబ్బులు డిమాండ్ చేశారు.
డబ్బులు ఇవ్వకుంటే అరెస్ట్ తప్పదని బెదిరింపు కాల్స్ చేశారు. దీంతో భయాందోళనకు గురైన తహసీల్దార్..ఆ కేటుగాళ్ల అకౌంట్ కు ఆన్‌లైన్‌లో రూ.3.30లక్షలు పంపించారు.
తీరా నకిలీ అధికారులని గమనించి.. మోసపోయానని సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేశాడు తహసీల్దార్ దామోదర్.
కేసు నమోదు చేసుకున్న రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే 1930కి కాల్ చేయాలని చూస్తున్నారు.
