PoliticalTelangana

కెసిఆర్ అంతం ఉద్యమకారుల పంతం.

తెలంగాణ దోపిడీ దారులను తరిమికొడదాం…!

నియంతలను. నీరోలను గద్దె దింపుదాం.

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు పట్టము కడదాం

మనం కోరుకున్న తెలంగాణ కోసం మరో పోరాటం… అమరవీరుల ఆకాంక్షలు నెరవేర్చుకునే ఆఖరి పోరాటం

కెసిఆర్ అంతం ఉద్యమకారుల పంతం.

తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బత్తుల సోమయ్య!

సి కె న్యూస్
నేలకొండపల్లి లో సీతారామ ఫంక్షన్ హలులో తొలిమలి దశ ఉద్యమకారుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బత్తుల సోమయ్య మాట్లాడుతూ….

ప్రత్యేక రాష్ట్ర సాధన పేరుతో సెంటిమెంట్‌ను రాజేసి, కోట్లాది మంది నిరుద్యోగులను, ఉద్యోగులను, రైతులను మభ్యపెట్టి తన పబ్బం గడుపుకున్న కేసీఆర్‌ తన నక్కజిత్తులతో తెలంగాణ ప్రజలను తన స్వార్ధ ప్రయోజనాలకు వాడుకుండు. వేలాది మంది అమర వీరుల త్యాగాల పునాదుల పై తన రాజకీయ వైకుఠపాళి నిర్మించుకొని తెలంగాణ బిడ్డలను బలితీసుకుండు. దాదాపు దశాబ్ధంన్నర నెత్తుటి పోరాటాలు చూసిన సోనియా గాంధీ, తమ ప్రభుత్వం తెలంగాణ ఇవ్వకుంటే ఈ నెత్తుటి ప్రవాహం ఇలాగే కొనసాగుతుందని భావించి, కేసీఆర్‌ రెచ్చగొట్టే వైఖరికి తెలంగాణ బిడ్డలు మట్టిలో కలిసిపోతున్నారని కలత చెంది, ఆంధ్రా లాబీయింగ్‌ను కాదని, తమ పార్టీకి రాజకీయంగా భారీ నష్టం వాటిల్లుతుందని తెలిసి కూడా ఆత్మహత్యల ప్రవాహానికి అడ్డుకట్ట వేసింది. తెలంగాణ రాష్ట్రానికి స్వీకారం చుట్టి కోట్లాది ప్రజల ఆకాంక్షను నెరవేర్చింది. అప్పటి వరకు సెంటిమెంట్‌ను అడ్డం పెట్టుకొని రాజకీయ వ్యాపారం చేసిన కేసీఆర్‌ చేతికి తెలంగాణ ఒక బంగారు గనిలా దొరికింది. మేక వన్నె పులిలా ఉన్న కేసీఆర్‌ను తెలంగాణ కోసం పోరాటం చేసిన నాయకుడుగా తెలంగాణ ప్రజలు నమ్మారు. ఒక్క అమయాక ప్రజలే కాదు, కేసీఆర్‌ టక్కు టమారం, గజకర్ణ గోకర్ణ గారడీ మాటలకు మేథావులు, పెద్దలు కూడా సంయమనం పాటించారు. తెలంగాణ వచ్చిన తొలినాళ్లలోనే తన అసలు రంగు చూపించాడు కేసీఆర్‌. తన ప్రాభవం, వైభవం చాటుకొని తెలంగాణ ప్రజలను చిన్న చూపు చూడటం మొదలు పెట్టాడు. ఉద్యమకారుల ఊసే లేకుండా, తానొక్కడే తెలంగాణ కొట్లాడి తెచ్చినట్టు ప్రచారం చేయడం మొదలు పెట్టాడు. దేవాలయాల మీద తన ఫొటోలు చెక్కించుకున్నాడు. సంక్షేమ పథకాలకు తన పేరే పెట్టుకుంటున్నాడు. తెలంగాణ కోసం ఉద్యమం చేసిన జయశంకర్ సార్ పేరు కానీ ఉద్యమకారుల ఉనికె లేకుండా చేసిండు. వాళ్ల పై మోపిన కేసులను ఎత్తేయకుండా వాళ్లు కోర్టుల చుట్టూ తిరుగుతుంటే పైశాచికానందం పొందిండు. అంతే కాదు తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసిన విద్యార్ధులు, నిరుద్యోగులు, ఉద్యోగులు చేసిన త్యాగాలు, పోరాటాలు మట్టిలో కలిపిండు. తెలంగాణ పోరాటం అంటే తన కుటుంబమని, తెలంగాణ అంటే తమ సొత్తు అన్నట్టుగా, ఆ సొత్తును తాను తన వారసులు అనుభవించడానికి అర్హులు అన్నట్టు నియంతృత్వ పోకడలతో పదేళ్లు తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిండు. ఈ తెలంగాణ ఎందుకు వచ్చిందా అని తల దించుకునే పరిస్థితికి దిగజార్చిన నీచమైన చరిత్ర కేసీఆర్‌ది. అభివృద్ధి పేరుతో చేపట్టిన ప్రతి ప్రాజెక్ట్‌ను ఆంధ్రా గుత్త పెత్తందార్లకు, కాంట్రాక్టర్లకు అప్పజెప్పి అడ్డగోలుగా దోచుకున్నడు. ఈ తెలంగాణ రాష్ట్రం తన ఇంటి సొత్తు అన్నట్టు ఇంటిల్లి పాదికీ పదవులు ఇచ్చి, అమర వీరుల కుటుంబాలకి మొత్తంగా ఒక్క పదవి ఇవ్వడానికి కూడా కేసీఆర్‌కు మనసు రాలేదు. అమరవీరుల తల్లి తండ్రులకు ఉద్యమకారులకు కనీసం పించన్‌సౌకర్యం అడిగినా కనికరించలేదు. తన కమిషన్‌ల కోసం కార్పోరేట్‌ సంస్థలకు కార్పెట్‌ వేసి విద్యార్ధులను కసాయి కొట్లకు బేరం పెట్టినట్టు ఆత్మహత్యలు చేసుకునేలా చేసిండు. అడ్డగోలు ఫలితాల వల్ల వందలాది మంది విద్యార్ధులు ఆత్మహత్యలు చేసికొని కన్నుమూసారు. నియామకాల పేరుతో తన కూతురు ఆడే బేరసారాలు టీఎస్‌పీఎస్సీ ద్వారా బయట పడతాయని, కేసు నీరు గార్చి ఒక్క ఉద్యోగం నియమించకుండా మాటలతో మభ్యపెడుతూ కాలం వెళ్లదీసి నిరుద్యోగులను మోసం చేసిండు. కనీసం నిరుద్యోగ భృతి కూడా ఇచ్చిన పాపాన పోలేదు. ఇక రైతుల పరిస్థితి అద్వాన్నంగా తయారైంది. రైతు బంధు పేరుతో ఒక ఎకరా, రెండు ఎకరాలు ఉన్న రైతులకు అరకొరగా విదిలిస్తూ వేలాది ఎకరాలు ఉన్న బడా బడా రైతులకు కోటాను కోట్ల రూపాయలు ధారాదత్తం చేసి తెలంగాణను బిచ్చమెత్తుకునేలా చేసిన చరిత్ర కేసీఆర్‌ది. అంతే కాదు ధరణి పోర్టల్‌ ద్వారా మొత్తము రెవిన్యూ వ్యవస్థను అతలాకుతలం చేసి రెవిన్యూ ఆఫీసులకు తాళాలు వేసే స్థితి తీసుకొచ్చింది ఈ నియంత నాయకుడే. ఎన్నో సంవత్సరాల క్రితం కొనుక్కున్న భూములు కూడా ధరణిలో కనిపించక, ఉన్న భూమి తక్కువ కనిపించి, కొందరి భూములు నిషిద్ద జాబితాలో చేరి, కొందరు అసలు ధరణిలోనే లేకుండా, ఇలా ఎన్నోరకాల సమస్యలతో తహశీల్ధార్‌ కార్యాలయాల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా చేసిన తుగ్లక్‌ నిర్ణయం కేసీఆర్‌ ది. వీఆర్‌ఓలను తొలగించి, తహశీల్ధార్‌కు అధికారాలు తీసేసి, కలెక్టర్‌కు కొన్ని అధికారులకు పరిమితం చేసి, మొత్తం నిర్ణయాలను తన గుప్పిట్లో పెట్టుకొని ఫాం హౌజ్‌లో పడుకున్న కేసీఆర్‌ రైతులను అష్ట కష్టాలు, అరిగోసలు పెట్టిండు. వ్యవసాయ మార్కెట్ లొ జరుగుతున్నా అవినీతిని ప్రశ్నించిన రైతుల చేతులకు బేడీలు వేసిన చరిత్ర కెసిఆర్ ది. యువతను మద్యానికి బానిస చేసి, విపరీతంగా మద్యం రేట్లు పెంచి, కోట్లు కొల్లగొట్టిన చరిత్ర కేసీఆర్‌ది. వాహనం తీసుకొని రోడ్డెక్కితే ఇంటికి వెళ్లేలోపే చలానా మెసేజ్‌ పంపి జేబులు కొల్లగొట్టిన జేబుదొంగ కేసీఆర్‌. నోటిఫికేషన్ల పేరుతో ఫీజులుగుంజి నిరుద్యోగుల నోటి దగ్గరి సొమ్ము లాక్కున్న పాపపు చరిత్ర కేసీఆర్‌ది. ఆ నోటిఫికేషన్ల డబ్బులు కూడా తిని ఉద్యోగాలు ఇవ్వకుండా రోడ్డున పడేసిన చరిత్ర కేసీఆర్‌ది.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కట్టేటప్పుడు మేథావులు, ఇంజనీర్లు, జలసంఘాలు నెత్తి నోరు కొట్టుకొని మొత్తుకున్నాయి. నా మాట వేదవాక్కు నేను చెప్పిన దానికి తిరుగులేదు న్న మొండి వైఖరితో, పిచ్చోడి చేతిలో రాయిలా కాళేశ్వరం ప్రాజెక్ట్‌ వల్ల లక్షల కోట్ల రూపాయల భారం తెలంగాణ బిడ్డల పై మోపిండు. ఇది కేసీఆర్‌ తన చరిత్రలో చేసిన మహా తెలంగాణ ద్రోహం. కేవలం తన భూమికి నీరు రావడం కోసం, తన కుటుంబానికి కమిషన్లు దక్కడం కోసం కేసీఆర్‌ కక్కుర్తి నేడు తెలంగాణ మళ్లీ పోరాటానికి సిద్దమయ్యే పరిస్థితి తెచ్చింది. ఈనగాచి నక్కల పాలు చేసినట్టు, నెత్తుటి ముద్దలై, రక్తం ఏరులై పారించి, తమ బిడ్డలను పోరాటాలకు అప్పజెప్పి తాము అప్పుల పాలు అయ్యామని తెలంగాణ ప్రజానీకం కడుపు రగిలిపోతోంది. ఈ నియంత పాలన పోవాలి. ఈ రక్తపు కూడు మరిగిన పిశాచాలను తరిమికొట్టాలి. నిరుద్యోగుల ఉసురు కొట్టుకున్న కేసీఆర్‌ కుటంబాన్ని రాజకీయంగా పదికిలోమీటర్ల మేర పాతిపెట్టాలి. ఉద్యోగులను రోడ్డెక్కించిన కేసీఆర్‌ కుటుంబాన్ని రాజకీయంగా రోడ్డు పై నిలబెట్టాలి. రైతుల భూములు లాక్కొని అరచేతిలో బెల్లం పెట్టి మోచేతితో నాకమని, రుణమాఫీని గంగలో కలిపిన కేసీఆర్‌ కుటుంబ రాజకీయలను గంగలో కలపాలి. తెలంగాణ బిడ్డలకు వైద్యం అందకుండా దోపిడీ దారులకు, దళారులకు అప్పజెప్పి రక్తము పీల్చుకొని వ్యాపారం చేస్తున్న కేసీఆర్‌ నీరో ప్రభుత్వాన్ని కూలదోయాలి. ఆరోగ్య శ్రీ, ఎంప్లాయ్‌మెంట్‌ హెల్త్‌ స్కీం, జర్నలిస్ట్‌ హెల్త్‌ స్కీంలను పాతరేసిన కేసీఆర్‌ ను రాజకీయంగా పాతిపెట్టాలి. తెలంగాణ కోరుకుంది నీళ్లు, నిధులు నియామకాలనే కానీ నియంతను కాదు. ఈ నియంత ఇక మనకొద్దు. మన బిడ్డలను కాపాడిన కాంగ్రెస్‌ను, సోనియా గాంధీని మనం నెత్తిన పెట్టుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటి వరకు మనం చేసింది నెత్తులు పగిలిన నెత్తుటి పోరాటం, ఉరికొయ్యలకు వేలాడిని ఆత్మత్యాగాల నినాదం. ఇప్పడు నయా నియంత, నాజీలను, నిజాంలను మించిన నీరోని రాజకీయంగా పతనం చేయకుంటే మనకు, ముందు తరాలకు ఇక భవిష్యత్‌ ఉండదు. ఇప్పుడు చేసే పోరాటమే అసలైన పోరాటం. ఇది ధిక్కార పోరాటం. గద్దెదించే పోరాటం. ఓటే ఆయుధంగా యుద్ధం చేసే పోరాటం. తెలంగాణ కోసం తెగించి పోరాడిన ఉద్యమ కారులమంతా ఒక్కతాటి పైకి వచ్చి చెప్తున్నాం. మన బిడ్డల భవిష్యత్‌ బాగుపడాలన్నా, మనం కోరుకున్న తెలంగాణ రావాలన్నా, నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు, మహిళలు అమరవీరుల తల్లితండ్రుల, ఉద్యమకారులందరి అందరి కళ్లలో వెలుగులు నిండాలంటే బ్యాలెట్‌ పేపర్ల నిండా చేతి గుర్తుకు ఓట్లు పడాలి. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం యువత చేతుల్లో ఉంది. మాటల గారడీలకు ఆగమాగం కావద్దు. ఇంకా కేసీఆర్‌ను నమ్మి ఒక్క అవకాశం ఇచ్చినా మన గొంతు మనం కోసుకున్నట్టే. మన గొయ్యి మనం తవ్వుకుంటున్నట్టే. ఇది తెలంగాణ ప్రజలు మొత్తం ఆలోచించాల్సిన అవసరం. ఉద్యమ గొంతుకలన్నీ కాంగ్రెస్‌ వైపు వేళ్లు చూపిస్తున్నాయి. రండి మన తెలంగాణను మనమే విముక్తి చేసుకుందాం. ఆత్మ హత్యలతో కాదు ఆత్మాభిమానంతో ముందుకు నడిపిద్దాం. కొత్త ఉదయాన్ని చూద్దాం. మనం కోరుకున్న కొత్త తెలంగాణకు పొద్దు పొడుపులై ఉదయిద్దాం. జై తెలంగాణ.. జైజై తెలంగాణ..

ఈ ప్రెస్ మీట్ లొ పాల్గొన్న తెలంగాణ ఉద్యమ నాయకులు, ఖమ్మం జిల్లా అధ్యక్షులు
మాదాస్ శ్రీనివాసురావు
69 ఉద్యమ కారుల జిల్లా అధ్యక్షలు కోయ వెంకటనారాయణ
సీనియర్ ఉద్యమ నాయకులు మెరుగు పుల్లయ్య, అంబాల రామారావు, ఎపూరి సత్యనారాయణ, తీగల రాములు, తోట వెంకట నారాయణ, వడీతియ రాజేష్ నాయక్, మోదుగు సూర్యకిరణ్, చావ రమేష్, ఎస్ కె అబజల్ , ఊళ్ళోజు వెంకన్న, అశోక్ సింగ్, ఎస్ కె డాన్, తప్సీ లింగయ్య, కూరపాటి కృష్ణమూర్తి, కిష్టపురం బిక్ష్మయ్య, చిన్నం సంగయ్య, పోచారం వీర భద్రం, ధనుజయ, నరసింహ, వొడెబోయిన వెంకటేశ్వర్లు, అంగిడి బిక్షం, మసన రమేష్, కలవకుంట్ల లత, నేలపట్ల వీరబాబు, రామాంజనేయులు, డిజిటల్ శ్యామ్, కూసుమంచి ముతయ్య, భువనగిరి నరసింహారావు, గుర్రం శ్రీను, దుండి సైదులు, గార్ల శేఖర్, వొళ్ళేబోయిన లెనిన్, బెజవాడ వెంకటేశ్వర్లు, మందడి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Hey there! We keep this news portal free for you by displaying ads. However, it seems like your ad blocker is currently active. Please consider disabling it to support us in keeping this platform running and providing you with valuable content. Thank you for your support!