జిల్లా విద్యార్థిని జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ పోటీలో జాతీయస్థాయికి ఎంపిక
సి కే న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (సంపత్) డిసెంబర్ 06
31వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ (NCSC) లో ఈరోజు హైదరాబాదులో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలో జిల్లాలోని తుర్కపల్లి మండలంలో గల ZPHS ముల్కలపల్లి పాఠశాల విద్యార్థిని భూక్య సలోని,గైడ్ టీచర్ పి.కళ్యాణి గారి సమక్షంలో రూపొందించిన “వాడిపడేసిన సిగరెట్ పీకతో కాలుష్యం పీక నొక్కుదాం” అనే ప్రాజెక్టు జాతీయ స్థాయికి సెలెక్ట్ చేయడం జరిగినది.
ఈ అవార్డును తెలంగాణ రాష్ట్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మెంబర్ సెక్రెటరీ శ్రీ మారుపాక నగేష్ గారు మరియు విద్యాశాఖ జేడీ శ్రీ మదన్మోహన్ గారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం జరిగింది.
జాతీయస్థాయిలో ఎంపికైనందుకు జిల్లా కలెక్టర్ శ్రీ హనుమంతు కే.జెండగే గారు, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) శ్రీ జి.వీరారెడ్డి గారు మరియు జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ కె.నారాయణ రెడ్డి గారు, జిల్లా సైన్స్ అధికారి భరణి కుమార్ అభినందించారు.