Telangana

సుబ్లేడు లో ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

సుబ్లేడు లో ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

సుబ్లేడు లో ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

  • హాజరైన 2002 బ్యాచ్ విద్యార్థులు
  • 22 ఏళ్ల తర్వాత బాల్య స్నేహితులంతా ఓ చోటుకు చేరడంతో నెలకొన్న సందడి

తిరుమలాయపాలెం: రెండు దశాబ్దాల తర్వాత కలిసిన.. ఆ మిత్రులంతా ఆనందంతో పులకించి పోయారు. పాఠశాల చదువు ముగిసి.. ఉద్యోగాల్లో కొందరు.. వ్యాపార, ఉపాధి బాటల్లో మరికొందరు.. ఎక్కడెక్కడో వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్న వారంతా.. 22 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థుల సమ్మేళనం పేరిట ఒక్క చోటుకు చేరిన అపురూప ఘట్టం ఆదివారం సుబ్లేడులో చోటుచేసుకుంది.
బాల్య జ్ఞాపకాలను నెమరేసుకుంటూ..
2002-2003 బ్యాచ్ కు చెందిన పదో తరగతి పూర్వ విద్యార్థులంతా.. ఇక్కడికి వచ్చారు. ఇన్నేళ్ల తర్వాత కలుసుకోవడంతో ఒకింత ఉద్విగ్నతకు లోనయ్యారు. అరేయ్ ఎలా ఉన్నావ్..?
ఏం చేస్తున్నావ్..?
పిల్లలు.. వారి చదువుల గురించి పరస్పరం ఆరా తీసుకున్నారు. పాఠశాల ఆవరణమంతా కలియతిరిగి..ఆటపాటలతో కాలక్షేపం చేసి.. బాల్య జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఆ రోజుల్లో తమకు పాఠాలు చెప్పిన గురువులు వై. నాగేంద్రం సార్, ఊషయ్య, లక్ష్మీ కుమారి, భాగ్యలక్ష్మి లను సత్కరించి, ఆశీర్వాదం పొందారు. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ.. అందరూ కలుసుకోవడం పట్ల అటు ఉపాధ్యాయులు..ఇటు పూర్వ విద్యార్థులు చాలా ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు.. గ్రేహౌండ్స్ ఆర్ఐ గంధసిరి గురుమూర్తి, షేక్. ఇస్మాయిల్, నరేష్, బ్రహ్మచారి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button