సీఎం రేవంత్ రెడ్డితో ఆర్టీసీ ఎండి సజ్జనార్ భేటీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ శుక్రవారం భేటీ అయ్యారు. రేపటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ప్రభుత్వం ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనుంది. ఇందుకు సంబంధించిన విధి విధానాలపై చర్చించేందుకు సజ్జనార్‌ సీఎంతో సమావేశ మయ్యారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి నియమ నిబంధనలు నేడు ఖరారు కానున్నాయి. దీనిపై అధ్యయనం …

సీఎం రేవంత్ రెడ్డితో ఆర్టీసీ ఎండి సజ్జనార్ భేటీ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ శుక్రవారం భేటీ అయ్యారు.

రేపటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ప్రభుత్వం ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనుంది. ఇందుకు సంబంధించిన విధి విధానాలపై చర్చించేందుకు సజ్జనార్‌ సీఎంతో సమావేశ మయ్యారు.

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి నియమ నిబంధనలు నేడు ఖరారు కానున్నాయి.

దీనిపై అధ్యయనం చేసేందుకు అధికారుల బృందం ఇప్పటికే కర్ణాటక వెళ్లింది.ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ఆర్టీసీపై భారం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు నిబంధనలు నిబంధనలపై అధ్యయనం చేశారు.

వివరాలను ఎండీ సజ్జనార్‌కు అందజేశారు. కాగా తెలంగాణలో ఇప్పటికే 40 శాతం మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. వీరికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తే ఆర్టీసీ సంస్థకు రావాల్సిన ఆదాయం రూ.4 కోట్లు తగ్గుతుంది.

ఇక సిటీ స‌ర్వీస్ ల ద్వారా రోజుకి మ‌రో 50 ల‌క్ష‌లు లాస్ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని స‌మ‌చారం..ఈ విష‌యాల‌నే ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీఎం రేవంత్ కు వివ‌రించిన‌ట్లు స‌మాచారం

Updated On 8 Dec 2023 3:41 PM IST
cknews1122

cknews1122

Next Story