Telangana

రైలు కింద పడి యువకుడు మృతి రైల్వే స్టేషన్ ముందు మరో మృతదేహం

రైలు కింద పడి యువకుడు మృతి

సీ కే న్యూస్ భువనగిరి ప్రతినిధి (శ్రీలత) డిసెంబర్ 8

భువనగిరిలో ఓ యువకుడు రైలు కిందపడి మృతి చెందిన ఘటన గురువారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. పట్టణ పరిధిలోని కలకొండ శ్రీనివాస్ అప్పుల బాధతో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. మృతుడు భువనగిరిలోని విద్యుత్ కార్యాలయంలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నాడని మృతుడికి ఇద్దరు పిల్లలు భార్య ఉన్నారని తెలిసింది.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

రైల్వే స్టేషన్ ముందు మృతదేహం

సీ కే న్యూస్ భువనగిరి ప్రతినిధి (శ్రీలత) డిసెంబర్ 08

భువనగిరి పట్టణం రైల్వే స్టేషన్ ముందు బయట ఆటో స్టాండ్ వద్ద ఒక దేవాలయం పక్కన శుక్రవారం ఉదయం ఓ వ్యక్తి నిర్జీవం గా పడి ఉన్నాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఘటన గురువారం రాత్రి జరిగినట్లు తెలుస్తుంది. ఘటన గల కారణాలు హత్య…? మరే ఇతర కారణాల..? అనేది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button