దళితుల ఆశలను నిరాశ చేస్తారా..! “లేక” కొనసాగిస్తారా..?
“అదృష్టం వరించింది కానీ దురదృష్టం వెన్నంటే ఉంది,”
“పేదోడి ఆకలికి ప్రభుత్వాలు అడ్డుపడతాయా…?
“చేతికి ఇచ్చిన దళిత బంధు పాస్ బుక్ వెనక్కి తీసుకున్నారు ఓ దళితుడి ఆవేదన”
“ములుగు జిల్లా సీకే న్యూస్ ప్రతినిధి భార్గవ్”
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ అగ్రకులాల చేత. అనగదొక్కబడుతు వెనకబడి ఉన్న పలు కులాలను దృష్టిలో పెట్టుకొని, సామాన్యుడిగా మెరుగైన ఆలోచనతో, ప్రజలంతా సమానంగా ఉన్న రోజే ప్రజాస్వామ్యానికి అర్థం అంటూ దళిత బంధు పేరుతో బడుగు బలహీన వర్గాలకు ఆర్థిక సాయం అందించాలన్న స్వయ ఉద్దేశంతో. మొదటి విడతలో బలహీనవర్గ ప్రజలకు దళిత బంధు పేరుతో కొంతమంది దళితులు లబ్ది పొందారు.
“కాగా” ఎలక్షన్ కోడ్ కు ముందే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బి.ఆర్.ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రెండవ విడత దళిత బంధుకు సంబంధించిన బడ్జెట్ను గత కాలంలో పత్రిక ముఖంగా వెల్లడించడంతో, దళిత బంధు రెండవసారి విడతలో అర్హులైన వారి, మొడు బారిన జీవితాలలో కొత్త చిగురు మొదలైంది,
“కానీ” మొన్నటి ఎలక్షన్లో ప్రభుత్వాలు మారడంతో తలకిందులైన దళితుల జీవితాలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల సర్వేలు పూర్తయినప్పటికీ, ప్రభుత్వ ఆన్లైన్ సర్వేలో నిర్ధారణ కాగా, దళితుడిగా దళిత బంధుకి అర్హుడిగా బ్యాంకులలో, దళిత బంధు పాస్ బుక్ అందుకొని.
వచ్చే ఆర్థిక సహాయంతో ఒక్కొక్కరు, పలు రకాల సమస్యలతో అనగా ఇల్లు,పెళ్లి, అనారోగ్యం, ఆర్థిక సమస్యలు, కుటుంబ జీవనం, అంటూ ప్రభుత్వం వైపు దళిత ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్న దళిత బాధితులు.
అన్ని రకాలుగా దళితుడిగా దళిత బంధుకి అర్హుడుగా ఎంపికైన వారిలో బాధితుడు “ఉదాహరణ:-” ములుగు జిల్లా మంగపేట మండలం రమణక్కపేట బాధితుడు మంగ పవన్ s/o వెంకటేశ్వర్లు వివరణ.