చర్ల వెంకటాపురం ప్రధాన రహదారి పై ఆటో యూనియన్ మహాధర్నా రాస్తారోకో
సీకే న్యూస్ ములుగు జిల్లా వెంకటాపురం మండల ప్రతినిధి ప్రశాంత్.
డిసెంబర్15
ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని బోదాపురం గ్రామంలో చర్ల వెంకటాపురం ప్రధాన రహదారి లో ఆటో యూనియన్ ఆటోలతో మహాధర్నా రాస్తారోకో చేయబడ్డారు.
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఫ్రీ బస్సులు పథకం పెట్టడం ద్వారా మా ఆటోలు ఎవరు ఎక్కటం లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఆటోలను ఖాళీగా తిప్పడం జరుగుతుంది.
కనీసం డీజిల్ వరకు కూడా డబ్బులు రావడం లేదు. మా ఆటోలకు EMI కట్టడం కూడా కష్టంగా ఉంటుంది. మా ఆటోవాళ్లు బతుకులు రోడ్డున పడ్డాయి.
మమ్ములను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని. ఆటో యూనియన్ అధ్యక్షుడు గంగిని బోయిన కృష్ణ మాట్లాడుతూ మా ఆటో వలన ఆదుకోవాలని ఆంధ్రాలో జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో వాళ్లకి 12000 వేల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా వల్ల భారీ ఎత్తున బస్సులు లారీలు కార్లు భారీగ వాహనాలు నిలిచిపోయినాయి.
అదేవిధంగా బస్సులో ప్రయాణం చేస్తున్న మహిళలు బస్సులు సమయానికి రావటం లేదని. రహదారులు సక్రమంగా లేవని . ఈ రహదారిలో బస్సులు ఎక్కువగా నడపాలని , రహదారులు బాగు చేయాలని ప్రభుత్వాన్ని కోరుకున్నారు . ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ అధ్యక్షులు, కార్యదర్శులు ఆటో కార్మికులు పాల్గొన్నారు