పౌరసరఫరాల శాఖ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శాఖ రూ.56 వేల కోట్ల అప్పుల్లో ఉందని వెల్లడించారు. గత పాలకుల వల్ల పౌరసరఫరాల శాఖలో అనేక తప్పిదాలు జరిగాయని ఆరోపించారు. 12 శాతం మంది రేషన్ బియ్యం తీసుకోవడం లేదని చెప్పారు. పేదలకు నాణ్యమైన రేషన్ బియ్యం అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో పౌరసరఫరాల శాఖపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. యాసంగిలో …

పౌరసరఫరాల శాఖ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శాఖ రూ.56 వేల కోట్ల అప్పుల్లో ఉందని వెల్లడించారు.

గత పాలకుల వల్ల పౌరసరఫరాల శాఖలో అనేక తప్పిదాలు జరిగాయని ఆరోపించారు. 12 శాతం మంది రేషన్ బియ్యం తీసుకోవడం లేదని చెప్పారు. పేదలకు నాణ్యమైన రేషన్ బియ్యం అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

హైదరాబాద్‌లో పౌరసరఫరాల శాఖపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. యాసంగిలో వానాకాలం ధాన్యం ఉత్పత్తిపై అధికారులతో ఉత్తమ్ చర్చించారన్నారు.

బియ్యం మిల్లింగ్ సామర్థ్యం, నాణ్యతపై అధికారులు వివరించారు. ధాన్యం కొనుగోళ్లపై ఆరా తీసినట్లు వెల్లడించారు. రేషన్ బియ్యాన్ని కొందరు పక్కదారి పట్టిస్తున్నారని ఉత్తమ్ ఆరోపించారు.

కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. మిల్లర్ల సమస్యలపై అధికారులతో చర్చించినట్లు మంత్రి తెలిపారు. 100 రోజుల్లో గ్యాస్ సిలిండర్ హామీని అమలు చేస్తానని హామీ ఇచ్చారు.

Updated On 16 Dec 2023 2:47 PM IST
cknews1122

cknews1122

Next Story