Political

హుజూర్ గర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎం.పి., మాజీ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ని ఓడిస్తాం: ధరావత్ బాల్సన్ నాయక్

హుజూర్ గర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎం.పి., మాజీ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ని ఓడిస్తాం: ధరావత్ బాల్సన్ నాయక్

హుజూర్ గర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎం.పి., మాజీ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ని ఓడిస్తాం: ధరావత్ బాల్సన్ నాయక్

హుజూర్నగర్ నియోజకవర్గంలో కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఓడించి తీరుతామని నియోజకవర్గ గిరిజనులు పట్టుదల, సంకల్పంతో తండాతండాకు, ఇంటి ఇంటికి, గడప గడపకు వెళ్ళి బి.ఆర్.ఎస్ పార్టీ ఎం.ఎల్.ఏ. అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ని భారిమెజార్టీతో గెలిపించుటకు గిరిజనులు ప్రచారం నిర్వహిస్తున్నారు.

గత దశాబ్దకాలంగా ఎం.ఎల్.ఏ.గా, ఎం.పి.గా, మంత్రిగా పనిచేసినటువంటి ఉత్తమ్కుమార్ రెడ్డి కాంగ్రెస్పార్టీ ప్రభుత్వ హాయాములో ఎన్నడు కూడా గిరిజన గ్రామాలను అభివృద్ధి పర్చలేదు. దొరపోకడతో గిరిజనులను విస్మరించడమే కాకుండా రాజకీయ ఎదుగుదలను కూడా నిలువరించడం జరిగింది. స్థానికంగా ఉన్న ఎం.ఎల్.ఏ. సైదిరెడ్డి ని రెండవసారి ఎన్నుకోవడం కోసం ప్రజలు సిద్ధముగా ఉన్నారు.

హుజూర్ నగర్ నియోజకవర్గం అభివృద్ధి చెందిందంటే గత కాంగ్రేస్ పార్టీ హాయంలో పాలనకంటే, బి.ఆర్.ఎస్. ప్రభుత్వ హాయాములో జరిగిన అభివృద్దే నిదర్శనం. గిరిజన ప్రజలకు బి. ఆర్.ఎస్. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారముగా తండాలను గ్రామ పంచాయతీగా చేయడం, 10% రిజర్వేషన్, విదేశీ విద్య నిధులు
సమకూర్చడం, సివిల్, గ్రూప్-1,2,3 కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడం, అటవీ హక్కు పత్రాలను కల్పించడం, గురుకులాలను ఏర్పాటు చేయడం మొదలైన గిరిజన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరిగింది.

ఎం.ఎల్.ఏ. సైదిరెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి, ఉత్తమ్కుమార్ రెడ్డి హయాంలో ఉన్న పరిస్థితులను పరిశీలించినట్లయితే రెండింటికి పొంతనేలేదు. నియోజకవర్గంలోగల ప్రజలకు స్థానికంగా అందుబాటులో ఉండి, ప్రజాసంక్షేమాన్ని కోరుచున్న సైదిరెడ్డి ప్రజలు గుండెల్లో నిల్చిపోయారు. గిరిజన ప్రజలు మోసపోతే- గోసపడ్డారని ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ సీనియర్ జిల్లా గిరిజన బి.ఆర్.ఎస్. పార్టీ నాయకులు ధారావత్ నాయక్ పేర్కొన్నారు.

మూడవసారి బి.ఆర్.ఎస్. ప్రభుత్వం అధికారంలోకి వచ్చేది ఖాయం, ప్రజలు పెద్దఎత్తున పట్టంకడతారు, కాంగ్రేస్ని సాగనంపుతారు, అటు కేంద్రంలోను, ఇటు రాష్ట్రంలోను కాంగ్రేస్ పార్టీ పూర్తిగా తూడ్చుకుపోతుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలకు,12 స్థానాలకు బి.ఆర్.ఎస్. పార్టీ కైవసం చేసుకుంటుందని తెలిపినారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button