పెన్షనర్లకు సన్మానం….
సి కే న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (సంపత్) డిసెంబర్ 18
పెన్షనర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని కాకు ఇన్ఫ్రా స్ట్రక్చర్ హబ్సిగూడ కు చెందిన సంస్థ వారు ఆలేరుకు చెందిన పెన్షనర్లను సన్మానము చేసినారు.
సన్మానాన్ని అందుకున్న వారిలో ఆలేరు ఎస్ టి ఓ పరిధి పెన్షనర్ల సంఘం అధ్యక్షులు చింతకింది మల్లయ్య,ప్రధాన కార్యదర్శి పరిగెల రాములు,ఆరుట్ల మహేందర్ రెడ్డి,గంగిటి కిష్టయ్య ఉన్నారు.
ఈ కార్యక్రమము కాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎండి కాకు శివకుమార్ ఆధ్వర్యంలో జరిగింది.కార్యక్రమం లో వెంకట్ రెడ్డి,మంద సోమరాజు,పటేల్ సుధాకర్ రెడ్డి ,బూడిద శ్రీనివాస్ , మద్దూరి కాంతారావు,మహమ్మద్ ఖాజా అలీ, సంజీవరెడ్డి, శేఖర్ పాల్గొన్నారు.