యూనివర్సిటీ హ్యాండ్ బాల్ క్రీడలలో ఎస్ఎల్ఎన్ఎస్ ప్రథమ స్థానం కైవసం…
సి కే న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (సంపత్) డిసెంబర్ 18
మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన అంతర్ కళాశాల హ్యాండ్ బాల్ క్రీడలలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళాశాల క్రీడాకారులు ప్రథమ స్థానంలో నిలిచారు. గెలుపొందిన క్రీడాకారులలో ఈశ్వర్, నరేష్, శ్రీధర్, రమేశ్ లు యూనివర్సిటీ సౌత్ జోన్ స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికయ్యారని
కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ గంజి రమేష్ తెలిపారు.కళాశాల కార్యదర్శి ఆర్. సుకేశ్ రెడ్డి సౌత్ జోన్ హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికై నందుకు హర్షం వ్యక్తంచేశారు.కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. శ్రీనివాస్ తమ క్రీడాకారులు గతంలో వివిధ పోటీల్లో ఓవరాల్ ఛాంపియన్ షిప్ కైవసం చేసుకునేలా శిక్షణ ఇచ్చిన కళాశాల వ్యాయామ అధ్యాపకులు బి.పాండురంగం ని అభినందించారు.క్రీడాకారులను అధ్యాపకులు,అద్యపకేతర సిబ్బంది జి. స్నేహ లత,పి. బాల్ రెడ్డి,కె. కిష్టయ్య, యన్.సత్యనారాయణ, యస్.రామకృష్ణ, కే. బాలరాజు, ఎన్. సుధ, శశి కిరణ్, శివ నాగేందర్, యాదగిరి రాజు అభినందించారు.