కీటక జనిత వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి….
ప్రజల ఆరోగ్యం పట్ల క్షేత్రస్థాయిలో అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలి…
కలెక్టర్ హనుమంతు కే. జండగే
సి కే న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (సంపత్) డిసెంబర్ 21
కీటక జనిత వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రజల ఆరోగ్యం పట్ల క్షేత్రస్థాయిలో అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హనుమంతు కే. జండగే వైద్యాధికారులకు సూచించారు.
గురువారం నాడు కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్యాధికారులు, హెల్త్ సూపర్వైజర్లు,మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్,మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లకు నిర్వహించిన కీటకజనిత వ్యాధుల నివారణ శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడుతూ….
క్షేత్రస్థాయిలో ప్రజల ఆరోగ్య సంరక్షణ పట్ల, కీటక జనిత వ్యాధుల నివారణపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.మలేరియా కేసులు గుర్తించినప్పుడు ఫీవర్ సర్వే నిర్వహించాలని, కేసుకు సంబంధించి దగ్గర ఉన్న కుటుంబ సభ్యుల రక్తం నమూనాలు సేకరించాలని,
చుట్టుపక్కల ఇళ్లలో కూడా ఫీవర్ సర్వే నిర్వహించాలని,దోమలు ఉండే ప్రదేశాలలో యాంటీ లార్వా మందులతో నియంత్రించాలని,ఇండోర్ స్ప్రే,అవుట్డోర్ స్ప్రే కార్యక్రమాలను చేపట్టాలని, చెరువులు కుంటలలో యాంటి లార్వా చర్యలు చేపట్టాలని,వాడకం లేని నీరు ఉన్న ప్రాంతాలలో కెమికల్స్ స్ప్రే చేసి నియంత్రించాలని సూచించారు.
శిక్షణ కార్యక్రమంలో వైద్యశాఖ (శిక్షకులు) అసిస్టెంట్ డైరెక్టర్లు విజయ్ కుమార్,నాగయ్య, జిల్లా వైద్య అధికారి డాక్టర్ పరిపూర్ణాచారి,జిల్లా మలేరియా అధికారి డాక్టర్ వినోద్, డాక్టర్ యశోద, డాక్టర్ పాపారావు, డాక్టర్ సుమన్, వైద్య అధికారులు పాల్గొన్నారు.