HyderabadPoliticalTelangana

తెలంగాణ విధ్వంస‌కారుడు కేసీఆర్‌!

తెలంగాణ విధ్వంస‌కారుడు కేసీఆర్‌!

తెలంగాణ విధ్వంస‌కారుడు కేసీఆర్‌!

టీజీటీఏ స‌ద‌స్సులో ఆకునూరి ముర‌ళీ.
రెవెన్యూ రికార్డుల‌ను ధ్వంసం చేశారు: ప్రొ.కోదండ‌రాం.

ck news hyderabad

కేసీఆర్ ఉద్య‌మ‌కారుడు కాద‌ని.. తెలంగాణ విధ్వంస‌కారుడ‌ని విశ్రాంత ఐఏఎస్ ఆకునూరి ముర‌ళీ ఆరోపించారు.రాష్ట్రం ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను, విద్యా వ్య‌వ‌స్థ‌ను, రెవెన్యూ వ్య‌వ‌స్థ‌ను,టీఎస్‌పీఎస్‌సీని,గ్రామ ప‌రిపాల‌న‌ను, ఇలా అన్ని ర‌కాల వ్య‌వ‌స్థ‌ల‌ను విధ్వంసం చేసిన మ‌హానుభావుడు కేసీఆర్‌గా తెలిపారు.జిల్లాల‌ల్లో క‌లెక్ట‌ర్ల‌ను రియ‌ల్ట‌ర్లుగా మార్చిన ఘ‌న‌త కూడా కేసీఆర్‌కే ద‌క్కుతుంద‌న్నారు.

జిల్లాల‌లో అత్య‌ధికంగా అవినీతికి పాల్ప‌డే క‌లెక్ట‌ర్ల‌ను తీసుకొచ్చి హైద‌రాబాద్‌, రంగారెడ్డి వంటి జిల్లాల‌లో పోస్టింగులు ఇచ్చి దోపిడీకి పాల్ప‌డ్డార‌ని మండిప‌డ్డారు. చివ‌ర‌కు ఎమ్మెల్యేలు సైతం దొంగ‌లుగా మారి దోచుకున్నార‌ని ఆరోపించారు. చివ‌ర‌కు రెవెన్యూ అధికారుల‌ను అవినీతి ప‌రులుగా ముద్ర వేయ‌డం ఎంత వ‌ర‌కు స‌రైంద‌ని ప్ర‌శ్నించారు.

తెలంగాణ త‌హ‌శీల్దార్స్ అసోసియేష‌న్‌(టీజీటీఏ) ఆధ్వ‌ర్యంలో రెవెన్యూ శాఖ బ‌లోపేతంకై చ‌ర్చా కార్య‌క్ర‌మం జ‌రిగింది.

తెలంగాణ డిప్యూటీ క‌లెక్ట‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు వి.ల‌చ్చిరెడ్డి అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా ఆకునూరి ముర‌ళీ, ప్రొ.కోదండ‌రాం, భూ చ‌ట్టాల నిపుణులు ఎం.సునీల్‌కుమార్‌, ప్రొ.జాన‌య్య‌, ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేత అశ్వ‌త్థామ‌రెడ్డి, త‌దిత‌రులు పొల్గొని మాట్లాడారు.

రాష్ట్రంలో 25వేల జూనియ‌ర్ అసిస్టెంట్ల నియామ‌కంతో గ్రామ‌స్థాయి రెవెన్యూ వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేయాల‌ని వి.ల‌చ్చిరెడ్డి ఈ సంద‌ర్భంగా కోరారు. ప‌రిపాల‌నా వికేంద్రీక‌ర‌ణ చేసి గ్రామ‌స్థాయిలోనే అన్ని ర‌కాల భూ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేలా వ్య‌వ‌స్థ‌ను రూపొందించాల‌న్నారు.

జిల్లాలు పెరిగిన‌ప్ప‌టికీ ఉద్యోగుల సంఖ్య పెర‌గ‌లేద‌న్నారు. ఉద్యోగుల సంఖ్య‌ను పెంచ‌డంతో పాటు ఇత‌ర విభాగాల‌కు బ‌దిలీ చేసిన వీఆర్ఓ, వీఆర్ఏల‌ను అదే హోదాలో రెవెన్యూ శాఖ‌కు ర‌ప్పించి గ్రామ స్థాయిలో పాల‌న‌ను ప‌టిష్టం చేయాల‌న్నారు.

రాష్ట్రంలో కేసీఆర్ ప‌రిపాల‌న చేయ‌లేద‌ని.. రాజ‌కీయ అవినీతికి పాల్ప‌డ్డార‌ని ఆకునూరి ముర‌ళీ ఆరోపించారు. అవినీతి, అక్ర‌మాల‌తో సంపాధించిన డ‌బ్బుతో దేశాన్నే కొనేయాల‌ని క‌ల‌లు క‌న్న‌ట్టుగా తెలిపారు.

గ్రామ స్థాయిలోనే రైతుకు అన్ని ర‌కాల సేవ‌ల‌ను అందించాల‌న్నారు. ఇందుకోసం ప‌టిష్ట‌మైన గ్రామ పాల‌నా వ్య‌వ‌స్థ‌ను రూపొందించాల‌న్నారు. మ‌న రాష్ట్రంను మ‌న‌మే ర‌క్షించుకోవాల‌ని పిలుపునిచ్చారు. కొత్త దొంగ‌లు త‌యార‌వ్వ‌కుండా చూసుకోవాల‌ని సూచించారు.

కేసీఆర్‌ సొంతానికే రెవెన్యూ చ‌ట్టంలో మార్పు: ప్రొ.కోదండ‌రాం:

న్యాయాన్ని ప‌క్క‌న పెట్టి, సొంత అవ‌స‌రాల కోసం చ‌ట్టాల‌ను తయారు చేస్తే ఎలా ఉంటుందో అదే ధ‌ర‌ణి అని ప్రొ.కోదండ‌రాం పేర్కొన్నారు. చ‌ట్టాల‌ను కూడా త‌న‌కు అనుకూలంగా మార్చుకున్నార‌న్నారు.

ఎప్పుడూ కూడా ఇలాంటి విధ్వంసం చూడ‌లేద‌న్నారు. ఏదైనా చ‌ట్టం త‌యారు చేస్తే పేద‌ల‌కు స‌త్వ‌ర న్యాయం జ‌రుగాలి. కానీ దీనికి భిన్నంగా గ‌త ప్ర‌భుత్వంలో త‌న సొంతానికే రెవెన్యూ చ‌ట్టంలో మార్పులు తెచ్చారంటూ కేసీఆర్‌పై మండిప‌డ్డారు.

చివ‌ర‌కు ఉన్న భూ రికార్డుల‌ను సైతం విధ్వంసం చేశార‌న్నారు. కేవ‌లం వారికి మాత్ర‌మే కావాల్సిన‌వి రాసుకున్నార‌ని ఆరోపించారు. మిగ‌తా జ‌రిగిన త‌ప్పుల‌కు రెవెన్యూ వారికి శిక్ష‌లు విధించ‌డం ఎంత వ‌ర‌కు స‌రైందంటూ ప్ర‌శ్నించారు.

వీఆర్ఓ, వీఆర్ఏల నుంచి క‌నీసం అభిప్రాయం కూడా తీసుకోకుండా రెవెన్యూకు దూరం చేశార‌న్నారు. వారు సింహాస‌నం అడ‌గ‌లేద‌ని.. ఫాంహౌస్‌లో భాగం అడ‌గ‌లేద‌న్నారు. అధికారులు పాల‌కుల కోసం కాకుండా ప్ర‌జ‌ల కోసం ప‌ని చేయాల‌ని పిలుపునిచ్చారు.

చిక్కులు లేని భూమి హ‌క్కులు ద‌క్కాలి ఎం.సునీల్‌కుమార్‌:

భూమి అంటే తెలంగాణ‌.. తెలంగాణ అంటే భూమి అని ప్ర‌ధాన‌మైన భూ స‌మ‌స్య‌ను తీర్చ‌కుండా ఏది కూడా ప‌రిష్కారం కాద‌ని భూమి సునీల్ కుమార్ పేర్కొన్నారు. ప్ర‌పంచ దేశాల‌లో భూ స‌మ‌స్య‌లు లేని దేశాలు మాత్ర‌మే అభివృద్ధి చెందుతున్న‌ట్టుగా తెలిపారు.

భూ ప‌రిపాల‌న గ్రామ స్థాయిలో ఉండాల‌న్నారు. భూమి హ‌క్కుల‌కు గ్యారంటీ కూడా గ్రామ‌స్థాయిలోనే ఇవ్వాల‌న్నారు. భూమి హ‌ద్దుల స్ప‌ష్టంగా, హ‌క్కుల క‌ల్పించే ప‌త్రాలు ప‌క్కాగా, హ‌క్కుల మార్పిడి వెంట‌నే జ‌రిగే వ్య‌వ‌స్థ ఉండాల‌న్నారు.

చిక్కులు వ‌స్తే గ్ర‌మా స్థాయిలోనే ప‌రిష్కారం కావాల‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు భూమి హ‌క్కుల‌కు ప్ర‌భుత్వ‌మే గ్యారంటీ ఇవ్వాల‌న్నారు. ద‌స్తావేజుల రిజిస్ట్రేష‌న్ కాదు.. హ‌క్కుల‌కు రిజ‌స్ట్రేష‌న్ కావాల‌న్నారు. ప‌క్క‌నే ఉన్న ఏపీలో ఈ దిశ‌గా చ‌ట్టం కూడా చేసుకున్నార‌ని గుర్తు చేశారు.

కార్య‌క్ర‌మంలో డిప్యూటీ క‌లెక్ట‌ర్ల సంఘం నేత‌లు ర‌మేష్ రాథోడ్‌, కె.రామ‌కృష్ణ‌, ఎన్ ఆర్ స‌రిత‌, టీజీటీఏ అధ్య‌క్షుడు ఎస్‌.రాములు, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎస్‌పీఆర్ మ‌ల్లేష్‌కుమార్‌, నేత‌లు ఉమాశంక‌ర్‌, పూల్‌సింగ్‌,

ర‌మేష్ పాక‌, ఆరేటి రాజేశ్వ‌ర్‌, వివిధ ఉద్యోగ సంఘాల నేత‌ల ఉపేంద‌ర్‌రావు, స‌త్య‌నారాయ‌ణ‌, ప‌ద్మ‌, రెవెన్యూ ఉద్యోగ సంఘాల మాజీ నేత‌లు, విశ్రాంత అధికారులు ల‌క్ష్మ‌య్య‌(ట్రెసా), ర‌వీంద‌ర్‌బాబు, శ్రీ‌నివాస‌రావు, మ‌ధుసూద‌న్‌, రాజారావు, త‌దిత‌రులు పాల్గొని మాట్లాడారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Hey there! We keep this news portal free for you by displaying ads. However, it seems like your ad blocker is currently active. Please consider disabling it to support us in keeping this platform running and providing you with valuable content. Thank you for your support!