PoliticalTelangana

ఏసీబీ వలలో సబ్ రిజిస్ట్రార్

ఏసీబీ వలలో సబ్ రిజిస్ట్రార్

ఏసీబీ వలలో సబ్ రిజిస్ట్రార్

ck news prathinidhi

అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దూకుడు మరింత పెంచారు. ప్రధానంగా కరప్షన్కు కేరాఫ్ గా మారిన వివిధ శాఖలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో తాజాగా గురువారం హనుమకొండ జిల్లా పరకాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దాడులు జరిపారు.

పరకాల మున్సిపాలిటీ పరిధిలోని సీతరాంపురంకు చెందిన ఓ వ్యక్తి నుంచి రూ.80 వేల లంచం తీసుకుంటున్న సబ్ రిజిస్ట్రార్ సునీతను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

వారసత్వ భూములు రిజిస్ట్రేషన్ చేసేందుకు ఆమె లంచం డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఆఫీస్ లో పనిచేస్తున్న ప్రైవేటు వ్యక్తి నరేశ్ తో పాటు సబ్ రిజిస్ట్రార్ సునీతను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

ప్రైవేటు వ్యక్తి అజయ్ ద్వారా సబ్ రిజిస్ట్రార్ సునీత పెద్ద మొత్తంలో ప్రజల నుంచి డబ్బు గుంజుతున్నట్లు, అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఇటీవల పరకాల సబ్ రిజిస్టార్ . ఈ తరుణంలో సబ్ రిజిస్ట్రార్ సునీత, ప్రైవేటు వ్యక్తి నరేశ్ ఏసీబీ వలకు చిక్కడం చర్చనీయాంశమైంది

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button