Ponguleti: మాటలు కాదు.. చేతల్లో చూపించాలనే నిబద్ధతతో పనిచేస్తున్నాం: మంత్రి పొంగులేటి ఖమ్మం : గత ప్రభుత్వం పేదల సమస్యలను విస్మరించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. రోజుకు 16 గంటలపాటు చిత్తశుద్ధితో తాము పని చేస్తున్నామని చెప్పారు.. ఖమ్మం గ్రామీణ మండలం మంగళగూడెంలో నిర్వహించిన 'ప్రజాపాలన' సభలో పొంగులేటి మాట్లాడారు.. 'గత ప్రభుత్వ పాలనతో రాష్ట్రం ఆర్థికంగా ఎంతో నష్టపోయింది. రూ.6.71 లక్షల కోట్లు అప్పు చేసింది. గత సీఎం ఎన్నో అప్పులు చేసి ప్రజాధనంతో …

Ponguleti: మాటలు కాదు.. చేతల్లో చూపించాలనే నిబద్ధతతో పనిచేస్తున్నాం: మంత్రి పొంగులేటి

ఖమ్మం : గత ప్రభుత్వం పేదల సమస్యలను విస్మరించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. రోజుకు 16 గంటలపాటు చిత్తశుద్ధితో తాము పని చేస్తున్నామని చెప్పారు..

ఖమ్మం గ్రామీణ మండలం మంగళగూడెంలో నిర్వహించిన 'ప్రజాపాలన' సభలో పొంగులేటి మాట్లాడారు..

'గత ప్రభుత్వ పాలనతో రాష్ట్రం ఆర్థికంగా ఎంతో నష్టపోయింది. రూ.6.71 లక్షల కోట్లు అప్పు చేసింది. గత సీఎం ఎన్నో అప్పులు చేసి ప్రజాధనంతో గొప్ప భవనం కట్టుకున్నారు.

మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను తొలి మంత్రివర్గ సమావేశంలో ఆమోదించాం. దీంతోనే మా ప్రభుత్వ చిత్తశుద్ధి కనిపిస్తోంది.

ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాం. ఆరోగ్యశ్రీ పరిధిని రూ.10 లక్షలకు పెంచాం. మాటలు కాదు.. చేతల్లో చూపించాలనే నిబద్ధతతో పనిచేస్తున్నాం" అని పొంగులేటి అన్నారు..

Updated On 3 Jan 2024 5:45 AM IST
cknews1122

cknews1122

Next Story