Telangana

హన్మకొండ జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం…

"వరంగల్-కరీంనగర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం"

బిగ్ బ్రేకింగ్ న్యూస్

“వరంగల్-కరీంనగర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం”

“రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారు ములుగు జిల్లా ఏటూరునాగారం గ్రామస్తులుగా పోలీసులు గుర్తించారు”

“ఏటూరునాగారం లో ఓకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి”

“మంతెన షేంకర్ తన కుటుంబ సభ్యులతో వేములవాడ వెళ్తుండగా”

“ఎల్కతుర్తి సమీపంలో కారును ఢీకొట్టిన ఇసుక లారీ”

“మంతెన కాంతయ్య (72 )
మంతెన శంకర్ (60)
మంతెన భరత్ (29 )”

“మంతెన వందన (16) నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా
మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అవ్వడంతో”

“క్షతగాత్రులను వరంగల్ ఎం.జీ.ఎం. కు పోలీసులు తరలించారు”

“ఎం.జీ.ఎం. లో చికిత్స పొందుతూ మంతెన రేణుక, మంతెన భార్గవ్,
మంతెన శ్రీదేవి”

“ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో ఏటూరునాగారం లో విషాదఛాయల్ అలుముకున్నాయి”

హన్మకొండ జిల్లాలోని ఎల్కతుర్తి మండలంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

ఎలుకతుర్తి మండలంలోని పెంచికల్‌పేట గ్రామ శివారులో వేగంగా దూసుకొచ్చిన లారీ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు.

మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు ప్రమాదం ధాటికి కారు నుజ్జునుజ్జు అయింది సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

స్థానికులు జేసీబీ సాయంతో కారులో ఇరుక్కుపోయిన వారిని అతికష్టం మీద బయటకు తీశారు క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. మృతులను మంతెన కాంతయ్య, శంకర్‌, భరత్‌, చందనగా గుర్తించారు.

వారంతా ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రానికి చెందినవారని, వేములవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. అర్ధరాత్రి మంచు ఎక్కువ ఉండటంతో దీంతో అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు బాధితులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో ఏటూరు నాగారంలో తీవ్ర విషాదం అలముకొన్నయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button