KhammamPoliticalTelangana

మహిళపై సీఐ లైంగిక వేధింపులు…!

మహిళపై సీఐ లైంగిక వేధింపులు…!

మహిళపై సీఐ లైంగిక వేధింపులు…!

Web desc : భర్త వేధిస్తున్నాడని న్యాయం చేయాలని ఓ మహిళ.. మహిళా పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది.. పోలీసులకు ఫిర్యాదు చేసింది.. అయితే.. ఆ మహిళ పై కన్నేసిన సీఐ న్యాయం చేస్తానంటూ దగ్గరయ్యాడు..

ప్రేమ, పెళ్లి పేరుతో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.. గర్భవతిని చేశాడు.. పెళ్లి గురించి అడిగితే టాబ్లెట్లు మింగించి అబార్షన్ చేయించాడు.. వివాహితపై వేధింపులకు పాలడ్డ సిసిఎస్ సిఐ రాజుపై కేసు నమోదవ్వడంతో ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.

ఖమ్మం కమిషనరేట్‌లో పనిచేస్తున్న సీఐ భూక్యా రాజు నాయక్‌ను పోలీసు ఉన్నతాధికారులు హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. ఈ ఖమ్మంలో జరిగిన ఈ ఘటన తెలంగాణలో కలకలం రేపింది.

వివరాల ప్రకారం.. వివాహిత మహిళను వేధించిన వ్యవహారంలో ఖమ్మం CCS స్టేషన్ CI బానోత్ రాజుపై ఖమ్మం 2టౌన్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది.. 2023లో ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్‌లో రాజు నాయక్ సీఐగా ఉండగా ఓ మహిళ తన భర్త వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది.

ఆమె ఫిర్యాదు నుంచి ఫోన్ నంబర్ తీసుకున్న సీఐ, న్యాయం చేస్తానని నమ్మించి తరచూ ఫోన్లు, మెసేజ్‌లు చేయడం ప్రారంభించాడు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఆమెను లోబర్చుకున్నాడు.

ఈ క్రమంలో బాధితురాలు గర్భం దాల్చడంతో తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. అయితే, సీఐ ఆమెకు బలవంతంగా కొన్ని ట్యాబ్లెట్లు మింగించడంతో గర్భస్రావం అయిందని బాధితురాలు పేర్కొంది.

ఆ తర్వాత కూడా పెళ్లి విషయాన్ని దాటవేస్తుండటంతో.. బాధితురాలు ఈనెల 7న ఖమ్మం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణలో సీఐ వేధింపులకు పాల్పడినట్లు తేలడంతో ఉన్నతాధికారులు అతన్ని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు.

కాగా.. బాధితురాలికి ఇటీవలే ఆమె భర్త నుంచి కోర్టు ద్వారా విడాకులు మంజూరయ్యాయి. ఆమెకు విడాకులు ఇప్పించేందుకు సీఐ రాజు నాయక్ ఆమె భర్తపై ఒత్తిడి తెచ్చినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button