ప్రభుత్వ పథకాల కోసం ఎవరికి ఎటువంటి లంచాలు ఇవ్వద్దు
— ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి.
సీకే న్యూస్ సత్తుపల్లి ప్రతినిధి మునీర్.
వేంసూర్ గ్రామం లో శుక్రవారం ప్రజా పాలనా అభయ హస్తం గ్యారంటీ పధకాల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం లో సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులు గల ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పధకాలు అందుతాయి అని ఎవరు ఎటువంటి లంచాలు ఇవ్వద్దు అని ముఖ్యం గా కళ్యణ లక్ష్మి పధకం, రైతు భీమా పధకం మరియు డెత్ సర్టిఫికెట్ కొరకు కొంతమంది డబ్బులు పేద వారి నుండి వసూలు చేస్తున్నారు అని తెలిసింది,
ప్రభుత్వ పధకాలు ప్రజలకు అందించటమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం,ఎవరైనా అడ్డదారులు తొక్కుతూ ప్రభుత్వనికి చెడ్డ పేరు తీసుకువస్తే వదిలే ప్రసక్తే లేదు అని తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రివర్యులు రేవంత్ రెడ్డి , ఖమ్మం జిల్లా మంత్రివర్యులు బట్టి కి, తుమ్మల కి, పొంగులేటి కి నా ధన్యవాదములు తెలుపుతూ ప్రజా పాలనా రాష్ట్ర ప్రభుత్వం నిరంతర ప్రక్రియ మరల 4 నెలలు తరువాత తిరిగి మరల ప్రజా పాలనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది అని ప్రజలకు తెలిపినారు.
ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ ఫైజుద్దీన్ , ఎమ్ అర్ ఓ, డి టి , వేంసూర్ మండలం కాంగ్రెస్ నాయకులు, గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు,గ్రామ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు.