HealthPoliticalTelangana

నాపై హత్యాయత్నం జరిగింది, నరకం అనుభవించా..

నాపై హత్యాయత్నం జరిగింది, నరకం అనుభవించా

నాపై హత్యాయత్నం జరిగింది, నరకం అనుభవించా: కేఏ పాల్ సంచలనం

విశాఖపట్నం: తన వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే ప్రజా శాంతి పార్టీ (Praja Shanti Party) చీఫ్ కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తనపై హత్యాయత్నం జరిగిందని పిడుగు లాంటి వార్త చెప్పారు. క్రిస్మస్ వేడుకల సమయంలో డిసెంబర్ 25న తనను చంపే ప్రయత్నం జరిగిందని కేఏ పాల్ (KA Paul) ఆరోపించారు. క్రిస్మస్ పండుగ సమయంలో టార్గెట్ చేసుకుని తనకు ఫుడ్ పాయిజన్ అయ్యేలా చేశారని పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

విశాఖపట్నంలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న కేఏ పాల్..
ఫుడ్ పాయిజనింగ్ తరువాత ప్రస్తుతం కోలుకుంటున్నానని కేఏ పాల్ తెలిపారు. ప్రస్తుతం విశాఖపట్నంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని పేర్కొన్నారు. దేవుడి దయ వల్ల తాను ప్రాణాలతో బతికి బయటపడ్డానని చెప్పారు.

ఈ విషయం చెప్పొచ్చో లేదోనని ఇన్ని రోజులు తాను మౌనంగా ఉన్నానని పేర్కొన్నారు. పది రోజుల నుంచి నరకం అనుభవిస్తున్నానని, కాన్ఫిడెన్షియల్ గా చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు.

రాజకీయ కుట్రలతో తనపై హత్యాయత్నం జరిగిందని కేఏ పాల్ చెప్పినట్లుగా ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button