KhammamPoliticalTelangana

సింగరేణి ఓబీ కార్మికులకు వారం రోజుల్లో న్యాయం చెయ్యాలి

సింగరేణి ఓబీ కార్మికులకు వారం రోజుల్లో న్యాయం చెయ్యాలి

సింగరేణి ఓబీ కార్మికులకు వారం రోజుల్లో న్యాయం చెయ్యాలి

— ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి, డాక్టర్ మట్ట దయానంద్.

సి కె న్యూస్ సత్తుపల్లి ప్రతినిధి మునీర్.

సత్తుపల్లి సింగరేణి ఓ సి లో ఓబీ కాంట్రాక్ట్ కార్మికులు సింగరేణి యాజమాన్యం పై పలు సమస్యలు పై సమ్మె చేస్తున్న సందర్బంలో సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మట్టా రాగమయి , డాక్టర్ మట్ట దయానంద్ విజయకుమార్ లు విషయం తెలుసుకుని ఓబీ కాంట్రాక్ట్ కార్మికులను కలుసుకొని ఓబీ కాంట్రాక్ట్ కార్మికులకు కాంట్రాక్టర్స్ నుండి మూడు నెలలుగా జీతాలు మరియు 8 నెలలుగా పి ఎఫ్ లు చెల్లించటం లేదు

అంతే కాకుండా కాంట్రాక్టర్స్ వారి పనులు సకాలంలో పూర్తి చెయ్యకుండా నిర్లక్ష్య వైకిరి చేస్తునందున కొత్త టెండర్ లు సింగరేణి యాజమాన్యం పిలవటం వలన ఓబీ కొంట్రాక్ట్ కార్మికులు పనులు లేక, జీతాలు లేక కుటుంబ ఆర్థిక భారం తో సింగరేణి యాజమాన్యం పై సమ్మె చేశారు అని సత్తుపల్లి సింగరేణి ఓబీ కార్మికులు కు భరోసాగా నిలిచినరు.

ఓబీ కార్మికుల సమస్యలు వెంటనే పరష్కరించి, వారి గత కాలంలో ఆగిన జీతాలు, పి ఎఫ్ లు మరియు తిరిగి కొత్త కొంట్రాక్ట్ వ్యవస్థ లో ఓబీ కార్మికులకు వారం రోజుల్లో న్యాయం చెయ్యాలి అని డాక్టర్ మట్టా దంపతులు సింగరేణి యాజమాన్యం కు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో సింగరేణి ఓబి కార్మికులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button