— అయ్యా మా సమస్యలను పరిష్కరించండి.
— జిల్లా కలెక్టర్,విద్యాశాఖ ప్రధాన అధికారి డీఈవో లకు వినతి పత్రాన్ని అందజేసిన మధ్యాహ్నం భోజనం కార్మికులు.
సికె న్యూస్ సత్తుపల్లి ప్రతినిధి మునీర్.
తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్నం భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం భోజన కార్మికుల సమస్యలను ఖమ్మం జిల్లా కలెక్టర్ కి మరియు ఖమ్మం జిల్లా విద్యాశాఖ ప్రధాన అధికారి డీఈవో కి సమస్యలతో కూడిన ఉన్నత పత్రం ఇవ్వడం జరిగింది .
గత రెండునెల కాలంగా బహిరంగ మార్కెట్లో నిత్యవసర సరుకులు కూరగాయలు పప్పులు, కోడిగుడ్లు విపరీతమైన రేట్లు పెరిగాయని పెరిగిన రేట్లు కనుగుణంగా మెనూ చార్జీలు పెంచాలని అలాగే కదా ఐదు నెలల కాలంగా రావాల్సినటువంటి ఎగ్ బిల్లులను మెనూ చార్జీలను గౌరవ వేతనాలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని ఏఐటియుసి తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్నం భోజన పథకం వర్కర్ సీనియర్ నాయకులు గత ప్రభుత్వం 2000 రూపాయల గౌరవ వేతనం పెంచి పూర్తిస్థాయి కార్మికులందరికీ ఇవ్వలేదని కాబట్టి విడుదల చేయాలని కోరారు
అలాగే మధ్యాహ్న భోజన కార్మికులకు భారంగా మారిన రాగి జావా తయారుచేసి పిల్లవాళ్ళకి వడ్డించినందుకు ప్రతి పిల్లవానికి రెండు రూపాయలు చొప్పున గ్యాస్ బిల్లు ఇవ్వాలని అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా పదివేల రూపాయలను వారికి అమలు చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు పై సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ని మరియు జిల్లా విద్యాశాఖ అధికారికి విన్నవించడం జరిగింది .
ఈ కార్యక్రమంలో మధ్యాహ్నం భోజనం పథకం వర్కర్స్ యూనియన్ నాయకురాలు మహాదేవ లక్ష్మి కుంటా ఎంకమ్మ అనసూయ పూసి సీత తాళ్లూరు లక్ష్మి నిజంగానే వెంకటమ్మ తేలపుట్ట వెంకటమ్మ ఎక్కిరాల మరియమ్మ వెంకటలక్ష్మి రాజ్యలక్ష్మి పి కనకమ్మ కనకమ్మ ఈ ఝాన్సీ విజయలక్ష్మి చిట్టెమ్మ తదితరులు పాల్గొన్నారు.