ఆటో డ్రైవర్లకు అండగా ఉంటాం… అధైర్య పడొద్దు
– మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి
ఖమ్మం : ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఎవరూ అధైర్య పడవద్దని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ఆటో డ్రైవర్లకు హామీ ఇచ్చారు.
ఖమ్మంలోని మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయంలో ఐటీ హబ్ , ఎన్టీఆర్ సర్కిల్ ,బల్లేపల్లి అడ్డాలకు చెందిన సూమారు 200మంది ఆటో డ్రైవర్లు ఐ ఎన్ టీ యూ సీ ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ విప్లవ కుమార్ ఆధ్వర్యంలో తుంబూరు దయాకర్ రెడ్డి సమక్షంలో ఐ ఎన్ టీ యూ సీ యూనియన్ లో చేరడం జరిగింది.
ఈ సందర్భంగా దయాకర్ రెడ్డి మాట్లాడుతూ… ఆటో డ్రైవర్ల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. పార్టీ మేనిఫెస్టోలో ప్రతి ఆటో డ్రైవర్ కు సంవత్సరానికి రూ. 12000/- లతో పాటు సంక్షేమ బోర్డు ఏర్పాటుకు హామీ ఇచ్చిందని అన్నారు.
గతంలో మంత్రి పొంగులేటి ఆటో డ్రైవర్లకు హెల్త్ కార్డులు ,ఖాకీ చొక్కాలు ఇచ్చారని ఎల్లప్పుడూ శ్రీనివాస రెడ్డి సహాయసహకారాలు ఉంటాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టీ యూ సీ ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు సైదులు, ఉపాధ్యక్షులు బొల్లిని నాగరాజు యాదవ్, కోశాధికారి తోట సైదులు, నగర అధ్యక్షులు జంగిపల్లి ప్రసాద్, ఉపాధ్యక్షులు పాషా, ప్రవీణ్, నాయకులు యం. నాయుడు, అడ్డా కమిటీ సభ్యులు వీరెందర్ రెడ్డి, బాలకృష్ణ, శంకర్, వీరబాబు, శంకర్, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.