విచక్షణ రహితంగా ఆర్టీసీ డ్రైవర్ పై వ్యక్తి దాడి
సంగారెడ్డి జిల్లా : ర్యాస్ గా డ్రైవింగ్ చేస్తూ ప్రమాదానికి కారకుడైన వ్యక్తి ఆర్టీసీ డ్రైవర్ ను కూర్చున్న సీట్ నుండి దించి కొట్టడం చర్చనీయంగా మారింది.
నిబద్దత, క్రమ శిక్షణతో విధులు నిర్వర్తిస్తున్న ఆర్టీసీ సిబ్బందిపై ఇలా విచక్షణరహితంగా దాడులకు దిగడం సమజసం కాదు. మహాలక్ష్మి పథకం అమలు తర్వాత సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగింది.
అయినా చాలా ఓపిక, సహనంతో వారంతా విధులు నిర్వర్తిస్తున్నారు. కానీ దాడులు చేయడం వంటి ఘటనలు సిబ్బందిలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి దాడులను యాజమాన్యం అసలే సహించదు.
ఆవేశంలో సిబ్బందిపై దాడి చేసి అనవసరంగా ఇబ్బం దులకు గురికావొద్దు.” అని ట్విట్టర్ వేదికగా దాడులు చేస్తున్నవారికి సజ్జనార్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
సజ్జనార్ స్పందించిన ఈ దాడి ఘటన.. సంగారెడ్డి జిల్లా ఆందోల్‌లోని ఎంపీ డీవో కార్యాలయం వద్ద మంగళవారం మధ్యాహ్నం జరిగింది.ద్విచక్రవాహనదారుడు నిర్లక్ష్యంగా నడిపటం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్పినట్టు తెలుస్తోంది.
అయినా సరే.. తన తప్పేం లేదంటూ ఆర్టీసీ బస్ డ్రైవర్‌పై దాడి చేయటం గమనార్హం. బూతులు తిడుతూ.. డ్రైవర్‌ను విచక్షణరహితంగా కొట్టాడు. ఈ దాడిపై ఆందోల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి తప్పు ఎవరిదో తెలియల్సి ఉంది.