PoliticalTelangana

ఏసీబీకి ప‌ట్టుబ‌డ్డ త‌హ‌సీల్దార్, డిప్యూటీ త‌హసీల్దార్

ఏసీబీకి ప‌ట్టుబ‌డ్డ త‌హ‌సీల్దార్, డిప్యూటీ త‌హసీల్దార్

ఏసీబీకి ప‌ట్టుబ‌డ్డ త‌హ‌సీల్దార్, డిప్యూటీ త‌హసీల్దార్

నిర్మల్ జిల్లా కడెంలో మండలంలో తహాసిల్దార్ కార్యాలయంలో అదిలాబా ద్ ఏసీబీ డిఎస్పి వి.వి. రమణమూర్తి ఆధ్వర్యంలో బుధవారం దాడులు నిర్వహించారు.

మండలంలోని కొత్త మది పడగా గ్రామానికి చెందిన లాసెట్టి రాజన్నకు చెందిన 35 గుంటల భూమిని పట్టా చేయడానికి కడెం మండల తహసిల్దార్ రాజేశ్వరి రూ.15వేలు లంచం అడగ్గా.. త‌హ‌సీల్దార్ కు రూ.9వేలు తమ భూమిని పట్టా చెయ్యాలని బాధితుడు కోరారు.

దీంతో బాధితుడు ఆదిలాబాదులోని ఏసీబీ అధికారులకు విషయం గురించి తెలపగా.. బుధ వారం తొమ్మిది వేల రూపా యలు బాధితుడు రాజన్న మండల డిప్యూటీ తహసి ల్దార్ చిన్నయ్య చేతుల మీదుగా కడెం మండల త‌హ‌సీల్దార్ రాజేశ్వరికి లంచం డబ్బులు ఇస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.

లంచం డబ్బులు తీసుకున్న మండల త‌హ‌సిల్దార్ రాజేశ్వరి, డిప్యూటీ త‌హ‌సిల్దార్ చిన్నయ్యను అరెస్టు చేసి ఏసీబీ కోర్టుకు పంపనున్నట్లు అదిలాబాద్ ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు.

ఈ దాడిలో ఏసీబీ ఎస్ఐలు రవీందర్, జాన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button